హోమ్ /వార్తలు /national /

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ... కేసీఆర్ ఆర్టీసీకి ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ... కేసీఆర్ ఆర్టీసీకి ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

సీఎం కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  మరో రెండు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.  ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 28న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో జరుగుతుంది. మరుసటి రోజు, అంటే శుక్రవారం కూడా సమావేశం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

  52 రోజుల పాటు సమ్మెకు కొనసాగించి ఆర్టీసీ కార్మికులు సోమవారంతో సమ్మెను ముగిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచే తాము విధుల్లోకి చేరుతామన్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం మాత్రం అనుమతించలేదు. లేబర్ కోర్టు నిర్ణయం తర్వాత  ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలన్న డిమాండ్ ను శాశ్వతంగా వదిలేయాలని, ఆపై నిర్దిష్ట కాలం పాటు మరోసారి సమ్మెకు దిగకుండా సంఘాలు, ఉద్యోగులతో సంతకాలు చేయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  సమ్మె విషయంలో అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వం పట్టు వీడకుండా నెలన్నర రోజులకు పైగా గడిపిన తరువాత, కార్మికులే మెట్టు దిగి విధుల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, ఇకపై ఇటువంటి ఘటనలు జరుగరాదని, ముఖ్యంగా పర్వదినాల వేళ సంస్థకు నష్టం కలిగించేలా కార్మికులు ప్రవర్తించకుండా చూడాలని కొన్ని నియమ నిబంధనలతో వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  First published:

  Tags: CM KCR, Rtc jac, RTC Strike, Telangana, Telangana Politics, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు