హోమ్ /వార్తలు /national /

Vijayashanti: విజయశాంతికి పెద్ద పరీక్ష పెట్టనున్న బీజేపీ.. అక్కడ విజయం సాధిస్తేనే..

Vijayashanti: విజయశాంతికి పెద్ద పరీక్ష పెట్టనున్న బీజేపీ.. అక్కడ విజయం సాధిస్తేనే..

Vijayashanti: విజయశాంతిని తమ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న బీజేపీ.. ఉప ఎన్నికల ప్రచారంలో ఆమెను సాగర్ నియోజకవర్గం చుట్టేలా చూడాలని ప్లాన్ చేసుకుంటోంది.

Vijayashanti: విజయశాంతిని తమ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న బీజేపీ.. ఉప ఎన్నికల ప్రచారంలో ఆమెను సాగర్ నియోజకవర్గం చుట్టేలా చూడాలని ప్లాన్ చేసుకుంటోంది.

Vijayashanti: విజయశాంతిని తమ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న బీజేపీ.. ఉప ఎన్నికల ప్రచారంలో ఆమెను సాగర్ నియోజకవర్గం చుట్టేలా చూడాలని ప్లాన్ చేసుకుంటోంది.

  తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది. త్వరలో రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ వెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికను కూడా సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీ ఇప్పటికే అనేక పర్యాయాలు సర్వేలు కూడా చేయించి పెట్టుకుందని సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికను బట్టి తమ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని బీజేపీ యోచిస్తోంది. ఇదిలా ఉంటే నాగార్జునసాగర్‌లో పార్టీ ఎన్నికల ప్రచారం ఏ రకంగా ఉండాలనే దానిపై కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. మిగతా స్థానాలతో పోలిస్తే నాగార్జునసాగర్ బీజేపీకి కాస్త భిన్నమైనది. గతంలో ఇక్కడ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈసారి అక్కడ మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. ప్రచారంపై ఎక్కువ ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తమ పార్టీ తురుపుముక్కగా విజయశాంతిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  విజయశాంతిని తమ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న బీజేపీ.. ఉప ఎన్నికల ప్రచారంలో ఆమెను సాగర్ నియోజకవర్గం చుట్టేలా చూడాలని ప్లాన్ చేసుకుంటోంది. తెలంగాణ యాసలో అధికార టీఆర్ఎస్‌ను విమర్శించడంలో విజయశాంతి దూసుకుపోతుంటారు. ఆమెకు తోడుగా మరికొందరు నేతలను సైతం సాగర్‌లో మోహరించి.. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేలా బీజేపీ అనుకుంటోందని తెలుస్తోంది.

  Vijayashanti news, Vijayashanti nagarjuna sagar news, Vijayashanti nagarjuna sagar news, telangana news, విజయశాంతి న్యూస్, విజయశాంతి నాగార్జునసాగర్ న్యూస్, తెలంగాణ న్యూస్
  అమిత్ షాతో విజయశాంతి (ఫైల్ ఫోటో)

  నిజానికి సాగర్‌లో తమ పార్టీ అభ్యర్థిగా విజయశాంతిని బరిలోకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా బీజేపీ చేసిందనే టాక్ ఉంది. అయితే ఆమె అక్కడ స్థానికేతరులుగా మారిపోతారని.. అది ఇతర పార్టీలకు అస్త్రంగా మారితే మొదటికే మోసం వస్తుందని బీజేపీ అంచనా వేసినట్టు తెలుస్తోంది. అందుకే విజయశాంతి సేవలను సాగర్‌లో ఈ రకంగా వినియోగించుకోవాలని అనుకుంటోంది. మరోవైపు విజయశాంతి విషయంలో బీజేపీ ఈరకమైన నిర్ణయం తీసుకుంటే.. అది ఆమెకు కలిసిరావడంతో పాటు పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె ప్రచారం ద్వారా బీజేపీకి ఏ మేరకు మైలేజ్ వస్తుందనే విషయం ఎన్నికల ఫలితాల ద్వారా తేలుతుందని.. అప్పుడు పార్టీలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాలా ? వద్దా ? అనే అంశంపై కూడా ఓ క్లారిటీ వస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు.

  First published:

  Tags: Nagarjuna Sagar By-election, Telangana, Vijayashanti

  ఉత్తమ కథలు