హోమ్ /వార్తలు /national /

Nagarjuna Sagar ByPolls: సాగర్‌లో కాంగ్రెస్‌కు భారీ ఝలక్ ఇస్తున్న బీజేపీ.. ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోటీ?

Nagarjuna Sagar ByPolls: సాగర్‌లో కాంగ్రెస్‌కు భారీ ఝలక్ ఇస్తున్న బీజేపీ.. ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోటీ?

తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

  తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ గత ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి. 2018 డిసెంబర్‌లో అక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జానారెడ్డిని పోటీకి దించుతామని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కాలేదు. కానీ, బీజేపీ కూడా చాలా మంది నేతల పేర్లను పరిశీలిస్తోంది. జానారెడ్డి కుమారుడు కె.రఘువీర్ రెడ్డి పేరును కూడా పరిశీలించింది. కానీ, జానారెడ్డి పార్టీ మారేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆ పేరు పక్కన పడిపోయింది. విజయశాంతిని బరిలో దింపుతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. తాజాగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాషాయ కండువా కప్పుకొని ఆయన్ను పోటీకి దించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ మీద తీవ్రంగా మండిపడుతున్నారు. బహిరంగంగానే పార్టీ మారతానంటూ కూడా ఓ దశలో ప్రకటించారు.

  నాగార్జున సాగర్‌లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు టి.చిన్నపరెడ్డి పేరును కూడా పరిశీలిస్తోంది. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన కె.సుచరితా రెడ్డి కూడా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరందరితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో ఎన్ఆర్ఐ కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు మూడు పార్టీలు అక్కడ పోటీని 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే నాగార్జున సాగర్‌లో గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది.

  కోమటిరెడ్డి రాజగోపాల్ 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఆయన కాంగ్రెస్ పెద్దల మీద అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఆయన ఇటీవల తిరుపతి వెళ్లిన సమయంలో తాను పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. కానీ, ఆ తర్వాత కొంత వెనక్కి తగ్గారు. బీజేపీ నేతలతో చర్చించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. సరైన సమయంలో పార్టీలో చేరడానికే ఆయన్ను అప్పుడు ఆపారని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. ఆయన్ను తీసుకొచ్చి నాగార్జున సాగర్‌లో పోటీ చేయిస్తే, ఒకవేళ ఆయన గెలిస్తే అప్పుడు ఏదో ఒక చోట ఎమ్మెల్యేగా ఉండాలి కాబట్టి, ఆయన మునుగోడుకు రాజీనామా చేస్తారని, అప్పుడు తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందని, ఆ రకంగా తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గకుండా చూసుకోవచ్చనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. అయితే, ఆల్రెడీ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డిని తీసుకొచ్చి సాగర్‌లో పోటీ చేయిస్తే అది ఎంత మేర ప్రభావం చూపుతుందనేది కూడా మరో వర్గం వాదన.

  First published:

  Tags: Bandi sanjay, Jana reddy, Komatireddy rajagopal reddy, Nagarjuna Sagar By-election, Telangana, Telangana bjp, Tpcc

  ఉత్తమ కథలు