హోమ్ /వార్తలు /జాతీయం /

కాంగ్రెస్ వల్లే మోదీ ప్రధాని అయ్యారు...రాస్కో సాంబా!

కాంగ్రెస్ వల్లే మోదీ ప్రధాని అయ్యారు...రాస్కో సాంబా!

ఈ క్రమంలో ఆయన స్థానంలో మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేతగా నియమిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇది ఆజాద్ సహా పలువురు నేతల్లో అసంతృప్తికి కారణమైందనే చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో ఆయన స్థానంలో మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేతగా నియమిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇది ఆజాద్ సహా పలువురు నేతల్లో అసంతృప్తికి కారణమైందనే చర్చ సాగుతోంది.

దేశంలో గత నాలుగేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే విరుచుకపడ్డారు.

ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యారంటే...ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడినందు వల్లే ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాన మంత్రి కాగలిగారని ఆయన సూత్రీకరించారు. ముంబయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ఖర్గే...ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత 70ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి కార్యక్రమంలో అడుగుతూ ఉంటారని...తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడబట్టే ఓ చాయ్‌వాలా ప్రధాన మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు.

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల వ్యక్తిత్వాలపై బీజేపీ ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోంది. మోదీ ఎప్పుడో 43ఏళ్ల క్రితంనాటి ఎమర్జెన్సీ గురించి విమర్శిస్తున్నారు...మరి దేశంలో గత నాలుగేళ్లుగా నడుస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ సంగతేంటి? మోదీ సర్కారు రైతుల శ్రేయస్సును గాలికొదిలేసింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ..వ్యవసాయ రంగానికి చెందిన పథకాలు విఫలమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం గద్దె దిగితేనే ప్రజలకు ‘అచ్ఛే దిన్‌’ వస్తుంది.
మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత

First published:

Tags: Mallikarjun Kharge, Pm modi

ఉత్తమ కథలు