హోమ్ /వార్తలు /national /

Devineni Uma: అజ్ఞాతంలో మాజీమంత్రి దేవినేని ఉమ.. సోషల్ మీడియాలో వైసీపీకి కౌంటర్

Devineni Uma: అజ్ఞాతంలో మాజీమంత్రి దేవినేని ఉమ.. సోషల్ మీడియాలో వైసీపీకి కౌంటర్

Devineni Uma: అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు దేవినేని ఉమా.

    టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమా అజ్ఞాతంలోకి వెళ్లారు. కర్నూలుకు చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న ఉమాపై సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీ సీఎం జగన్ మాట్లాడినట్టు మార్పింగ్ వీడియోలను ప్రెస్ మీట్‌లో చూపించినందుకు మాజీ మంత్రి దేవినేని ఉమాపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. 464, 468, 470, 471, 505, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ దేవినేని ఉమాకు ఈ నెల 15, 19 రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన నుంచి స్పందన రాకపోయేసరికి అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లారు. మరోవైపు ఉమా ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

    అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు దేవినేని ఉమా. పోలవరం అంచనాలు పెంచడంపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. తనపై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో చెప్పే ధూర్యం ఉందా ? అని సవాల్ విసిరారు. ఈ విషయంలో సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇక కొద్దిరోజుల క్రితమే కరోనా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నానని.. డాక్టర్ల సలహా మేరకు రక్షణ చర్యలు పాటిస్తున్నానని తెలిపారు.

    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP Politics, Devineni uma, Devineni Uma Maheswara Rao, TDP, Ysrcp

    ఉత్తమ కథలు