అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇతర సభ్యులకు సిగరెట్లు పంచుతున్న వీడియో వైరల్గా మారింది. అసెంబ్లీలో విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతున్న సమయంలో వెనుక రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వల్లభనేని వంశీ.. తన జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి.. గద్దె రామ్మోహన్ వెనుక కూర్చున్న ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. రెండు సిగరెట్లను చెరొకటి ఇచ్చారు. అయితే, ఆ సిగరెట్లు తీసుకున్న ఎమ్మెల్యేలు ఎవరనేది వీడియోలో కనిపించలేదు. శాసనసభ సమావేశాలు లైవ్ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన కెమెరాకు చిక్కింది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడతారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారాయన. ఆ తర్వాత పార్టీ మార్పు మీద ఎలాంటి వార్తలు రాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Assembly, TDP, Vallabaneni Vamsi