హోమ్ /వార్తలు /national /

జగన్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో నలుగురు టీడీపీ నేతల పిటిషన్

జగన్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో నలుగురు టీడీపీ నేతల పిటిషన్

సుప్రీంకోర్టులో టీడీపీ నేతల పిటిషన్

సుప్రీంకోర్టులో టీడీపీ నేతల పిటిషన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడంపై సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీసీలకు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల 15వేల మంది నాయకులు నష్టపోతారని టీడీపీ నేతలు వాదించారు.

బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని వారు ఆరోపించారు. వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, సీఎం జగన్ సన్నిహితులు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేశారని మండిడ్డారు.

జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే వారి రిజర్వేషన్లనే జగన్ కుదిస్తున్నారని విమర్శించారు. సొంత కేసులకు కోట్ల రూపాయలు చెల్లించి న్యాయవాదులను నియమించుకునే జగన్ బీసీల కేసులో ఎందుకు సమర్ధుడైన న్యాయవాదిని నియమించలేదని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 176 ను యధాతథంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సీఎం జగన్ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకునేందుకు చూశారే తప్ప వారికి న్యాయం చేయాలని చూడలేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్లే తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ 24 శాతానికి ఎలా పడిపోతుందని ప్రశ్నించారు. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే ఇలాంటి పరిణామాలు తలెత్తుతాయి.  జగన్‌మోహన్‌రెడ్డి బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మరో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21న, పురపాలక సంఘాలకు ఈనెల 24న, గ్రామ పంచాయతీలకు 27న వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 6న రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Rammohan naidu, Supreme Court

ఉత్తమ కథలు