హోమ్ /వార్తలు /national /

Kodali Nani: అదేం భాష ?.. కొడాలి నానిపై టీడీపీ నేతల ఫిర్యాదు

Kodali Nani: అదేం భాష ?.. కొడాలి నానిపై టీడీపీ నేతల ఫిర్యాదు

మంత్రి కొడాలి నాని (ఫైల్)

మంత్రి కొడాలి నాని (ఫైల్)

Kodali Nani News: కొడాలి నానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. దీనిపై గవర్నర్‌ను కూడా కలుస్తామని తెలిపారు.

  Kodali Nani: తనదైన స్టయిల్లో టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించే ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసిన టీడీపీ నేతలు వర్ల రామయ్య, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు.. నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొడాలి నాని వాడుతున్న భాష అప్రజాస్వామికమని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. కొడాలి నానిపై చర్యలు తీసుకుంటారేమోనని తాము ఇంతకాలం ఎదురుచూశామని తెలిపారు. ఈ అంశంలో తాము మొదట డీజీపీని కలవాలని భావించామని, కానీ డీజీపీ బిజీగా ఉన్నారని చెప్పడంతో విజయవాడ సీపీని కలిసి కొడాలి నాని తీరుపై వివరించామని నేతలు తెలిపారు.

  కొడాలి నానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. దీనిపై గవర్నర్‌ను కూడా కలుస్తామని టీడీపీ నేతలు తెలిపారు. ఇక ఏపీలో టీడీపీ నేతలను వైసీపీ తరపున ధీటుగా విమర్శించే నాయకుల్లో కొడాలి నాని ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు అక్కడ శాసన రాజధాని కూడా ఉండాల్సిన అవసరం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని.. ఆయన కూడా దీనిపై చర్చిద్దామని అన్నారని కొడాలి నాని అనడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Kodali Nani

  ఉత్తమ కథలు