Home /News /national /

POLITICS TDP LEADER NARA LOKESH COMMENTS ON AP CM YS JAGAN MOHAN REDDY AK

Nara Lokesh: కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ జగన్‌కు లేదు.. మూల్యం చెల్లించుకుంటారన్న నారా లోకేశ్

నారా లోకేశ్ (ఫైల్ పోటో)

నారా లోకేశ్ (ఫైల్ పోటో)

Nara Lokesh: పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. జగన్ వల్ల ఏపీ పోలీసులకు చెడ్డపేరు వస్తోందని నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి 24 గంటలు గడిచినా ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

    టీడీపీ పార్టీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడి తరువాత సీఎం జగన్ సైకో అని మరోసారి రుజువైందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో కొందరిని పంపి దాడి చేయిస్తే తాము భయపడతామని భ్రమ పడుతున్నారని.. ప్రతిపక్షంగా ప్రజలు తమకొక బాధ్యత అప్పగించారని లోకేశ్ అన్నారు. ప్రజల తరపున తాము ప్రజా సమస్యలపై నిలదీస్తున్నామని... తాము అడిగే ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెద్దఎత్తున చెలరేగిపోతోందని లోకేశ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మూలాలు ఏపీలో ఉంటున్నాయని అన్నారు. జగన్ రెడ్డి సీఎం అయిన తరువాత డ్రగ్స్‌ను లీగలైజ్డ్ ట్రేడ్ కింద మార్చారని నారా లోకేశ్ విమర్శించారు.

    హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఏపీ నుంచి పెద్దఎత్తున గంజాయి తెలంగాణకు అక్రమంగా వస్తోందని, అక్కడ పెద్ద ఎత్తున పండిస్తున్నారని చెప్పారని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు ఏపీకి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసి, కాల్పులు కూడా జరిపారని అన్నారు. తెలంగాణ పోలీసులకు ఉన్న చిత్తశుద్ధి ఏపీ పోలీసులకు లేదని ఆరోపించారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఏపీలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోయిందని మండపిడ్డారు. పోర్టులో హెరాయిన్ పట్టుబడితే కేరాఫ్ అడ్రస్ విజయవాడ ఉందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే గంజాయి హైదరాబాద్ తరలిపోతోందని.. కేసీఆర్ కూడా గంజాయి అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని నారా లోకేశ్ తెలిపారు. ఇక్కడ మాత్రం జగన్‌కు చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు.

    దాడి జరిగే ముందు తమ నాయకులు పోలీసులకు ఫోన్ చేసినా సరిగ్గా స్పందించలేదని లోకేశ్ అన్నారు. కొంతమంది పోలీసులు మఫ్టీలో వచ్చి కార్యాలయంలో దాడికి పాల్పడ్డారు. డీజీపీ ఆఫీసు ముందు నుంచే వైసీపీ శ్రేణులు వచ్చాయని.. దాడి తర్వాత కూడా డీజీపీ ఆఫీసు ముందు నుంచే వెళ్లారని అన్నారు. భాష గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు ఉందా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ యూనివర్సిటీ అని.. భాష గురించి లెక్చర్లు ఇవ్వొద్దని అన్నారు.

    Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

    Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

    పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. జగన్ వల్ల ఏపీ పోలీసులకు చెడ్డపేరు వస్తోందని నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి 24 గంటలు గడిచినా ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు దిగజారి వ్యవహరించవద్దని.. అధికారం శాశ్వతం కాదని అన్నారు. టీడీపీ సహనాన్ని చేత‌కానిత‌నం అనుకుంటే.. అది సీఎం జగన్ పతనమే అని హెచ్చరించారు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని.. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Nara Lokesh

    తదుపరి వార్తలు