హోమ్ /వార్తలు /national /

కవిత కోసమే టీఆర్ఎస్‌లోకి టీడీపీ నేత... ఇదీ కేసీఆర్ ప్లాన్

కవిత కోసమే టీఆర్ఎస్‌లోకి టీడీపీ నేత... ఇదీ కేసీఆర్ ప్లాన్

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో 180 మంది రైతులు పోటీ చేస్తుండటంతో... కూతురి కవిత విజయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతను స్వయంగా సీఎం కేసీఆర్ తానే తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో 180 మంది రైతులు పోటీ చేస్తుండటంతో... కూతురి కవిత విజయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతను స్వయంగా సీఎం కేసీఆర్ తానే తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో 180 మంది రైతులు పోటీ చేస్తుండటంతో... కూతురి కవిత విజయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతను స్వయంగా సీఎం కేసీఆర్ తానే తీసుకున్నట్టు తెలుస్తోంది.

  తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్‌లో చేర్చుకునే విషయంలో కేసీఆర్ ఇప్పటివరకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాంటి కేసీఆర్ శుక్రవారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి టీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానించారు. ఇందుకు సమ్మతించిన మండవ... త్వరలోనే తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మండవను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం వెనుక అసలు కారణం... నిజామాబాద్‌లో ఎంపీ కవిత విజయానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే వ్యూహమే అని వేరే చెప్పనవసరం లేదు.

  Telangana, cm kcr, ttdp leader mandava venkateshwara rao, trs, Nizamabad, mp kavitha, lok sabha election 2019, తెలంగాణ, సీఎం కేసీఆర్, టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్, నిజామాబాద్, ఎంపీ కవిత, లోక్ సభ ఎన్నికలు 2019
  మండవ వెంకటేశ్వరరావుతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్

  నిజామాబాద్‌ ఎన్నికల బరిలో 180 మంది రైతులు పోటీ చేస్తుండటంతో... కూతురి విజయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతను స్వయంగా సీఎం కేసీఆర్ తానే తీసుకున్నట్టు అర్థమవుతోంది. అయితే కేసీఆర్ ఇప్పటికప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీమంత్రి మండవను పార్టీలోకి తీసుకోవడం వెనుక అసలు కారణం... రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ తీసుకురావడం కోసమే అని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, బోధన్ నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్ సభ పరిధిలోకి వస్తాయి.

  Telangana news, telangana politics, cm kcr, telangana cm kcr, trs president kcr, congress, Nizamabad mp candidate, kavitha husband anil kumar, mp kavitha into telangana cabinet, trs working president ktr, trs leader harish rao, తెలంగాణ న్యూస్, తెలంగాణ రాజకీయాలు, సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, కవిత భర్త అనిల్ కుమార్, తెలంగాణ మంత్రివర్గంలోకి కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు,
  సీఎం కేసీఆర్, ఎంపీ కవిత(File)

  వాస్తవానికి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ... ఆ తరువాత కొద్ది రోజులకే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆర్మూర్ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లోని పసువు రైతు, ఎర్ర జొన్నల రైతులు మద్దతు ధర కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారు. తమ ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదనే కారణంగా వారంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక బోధన్‌లోని చెరుకు రైతులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీమంత్రి జీవన్ రెడ్డి... కరీంనగర్ పట్టుభద్రుల నియోజకవర్గంలో విజయం సాధించి... తనను ఓడించిన కవితపై రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నారు.

  mp kavitha,kavita,nizamabad,ys jagan,rahul gandhi,congress,lok sabha elections 2019,lok sabha election,lok sabha election 2019,2019 lok sabha elections,lok sabha elections,2019 elections,lok sabha polls,lok sabha elections 2019 telangana,india lok sabha election date,andhra pradesh lok sabha election 2019,india lok sabha election 2019,bjp leader before lok sabha elections,telangana 2019 lok sabha,election,lok sabha alliance,ap assembly elections 2019,ap assembly elections,ap elections 2019,assembly elections,ap elections,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly elections 2019 survey,ap assembly elections 2019 schedule,ap assembly elections 2019 predictions,ap assembly election schedule 2019,ap assembly elections 2019 candidates list,opinion poll survey on ap assembly elections 2019,ap politics,లోక్ సభ ఎన్నికలు,తెలంగాణ ఎన్నికలు,ఏపీ అసెంబ్లీ ఎన్నికలు,మోదీ,రాహుల్,కనీస ఆదాయ పథకం,ఎంపీ కవిత,నిజామాబాద్,పసుపు బోర్డు,రైతుల నామినేషన్లు,
  ఎన్నికల ప్రచారంలో కవిత

  ఇక నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్‌లో టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్... తన కుమారుడైన బీజేపీ అభ్యర్ధి అరవింద్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో డీఎస్‌కు ఎంతో కొంత పట్టు ఉంది. ఆయన నుంచి టీఆర్ఎస్‌కు సహకారం లభించే అవకాశం లేకపోవడంతో... ఈ రెండు నియోజకవర్గాల్లో కొంత మేర పట్టు ఉన్న మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తానికి కూతురు కవిత గెలుపు కోసం సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నట్టు అర్థమవుతోంది.

  First published:

  Tags: CM KCR, Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad S29p04, Telangana Lok Sabha Elections 2019, Trs

  ఉత్తమ కథలు