హోమ్ /వార్తలు /national /

‘డబ్బుల పంపకం’ వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి యూ టర్న్

‘డబ్బుల పంపకం’ వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి యూ టర్న్

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

అధికారుల అవినీతికి అంతు ఉంటుందని, రాజకీయ నేతల అవినీతికి అంతు ఉండదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

ఈనెల 11న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు ఖర్చు అయ్యాయని, అనంతపురంలోనే రూ.50కోట్లు ఖర్చయిందని సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారు. తాను ఒక్క రూపాయి కూడా పంచలేదని, తన కుమారుల సంగతి తనకు తెలియదని చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేసినప్పుడు ఓటర్లకు రూపాయి ఇచ్చానన్నారు. అయితే, ఇప్పుడు ఓటుకు రూ.2వేలు ఇచ్చారని, కొన్నిచోట్ల రూ.5వేలు కూడా ఇచ్చారని అన్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో రూ.10వేల కోట్లకు పైగానే ఖర్చు అయిందని చెప్పారు.

అధికారుల అవినీతికి అంతు ఉంటుందని, రాజకీయ నేతల అవినీతికి అంతు ఉండదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఒకసారి ఎన్నికైన వారు.. ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును, వచ్చే ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బుల కోసం రాజకీయ నేతలు అవినీతికి పాల్పడతారని చెప్పారు. ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బు పంపకాన్ని అంతం చేసేందుకు తాను నడుంబిగించానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అయితే, ఆ స్థాయి తనకు లేదు కాబట్టి, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, న్యాయమూర్తి మాధవరెడ్డి, జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణలాంటి వారి సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు.

First published:

Tags: Anantapur S01p19, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, JC Diwakar Reddy, Lok Sabha Election 2019, TDP

ఉత్తమ కథలు