టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్వరం మార్చారు. తెరపైకి కొత్త డిమాండ్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని మొదలు పెడతామని అన్నారు. గ్రేటర్ రాయలసీమ కోసం త్వరలోనే సమావేశం అవుతామని, తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం మార్చాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చితేనే సరైన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాగా, ఇప్పటి వరకు టీడీపీ నేతలు అమరావతి మాత్రమే రాజధాని అంటూ టీడీపీ నేతలు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అయిన దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు కాస్త ఇబ్బందిగా మారింది.
ఇదిలా ఉండగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని దివాకర్ రెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో కలిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బీజేపీ గూటికి చేరతారని వార్తలు వచ్చాయి. అయితే.. తనకు బీజేపీలో చాలా మంది మిత్రులు ఉన్నారని, జిల్లాకు వచ్చిన వారిని మర్యాద పూర్వకంగానే కలిసానని జేసీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, AP Politics, JC Diwakar Reddy, Rayalaseema