హోమ్ /వార్తలు /national /

నేను తలచుకుంటే వైసీపీ ఉండేది కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

నేను తలచుకుంటే వైసీపీ ఉండేది కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఈ భేటి సందర్భంగా  25 పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ కమిటీలకు నూతనంగా ఎంపికైన నాయకులను చంద్రబాబు అభినందించారు. ఆయా పార్లమెంట్ల పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తామని, సదరు నాయకులంతా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో రెండో రోజు పర్యటనలో ఉన్న బాబు.. గురువారం సమావేశంలో మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో రెండో రోజు పర్యటనలో ఉన్న బాబు.. గురువారం సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు చాలా నీచమని, దారుణమని అన్నారు. వైసీపీ ఉండకూడదని తాను అనుకొని ఉంటే.. ఒక్కరు కూడా ఉండేవారు కాదని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు పనికట్టుకొని టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, పోలీసులను పక్కనపెట్టి యుద్ధానికి రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. అప్పుడు ఎవరి బలమెంతో తెలిసిపోతుందని అన్నారు. అలిపిరిలో తనపై దాడి చేస్తే తిరుమల వెంకన్న కాపాడాడని, అది పెద్ద దాడే అయినా.. తాను అలాంటి వాటికి భయపడనని వ్యాఖ్యానించారు. అనంతపురంలో వైసీపీ దాడులు ఎక్కువయ్యాయని, దాడిపై కేసులు పెడితే.. రిటర్న్ కేసులు ఫైల్ చేస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని, ఊపిరి ఉన్నంత వరకు తాను రాజీలేకుండా పోరాడతాను తప్ప వదిలే ప్రసక్తే లేని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా వేదిక నుంచే ప్రభుత్వ విధ్వంసం మొదలైందని అన్నారు. జగన్ ఒక ఉన్నాది అని, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు. అధికారంతో జగన్ అందర్నీ కొడుతున్నారని, అయితే.. ఆయనది భస్మాసురహస్తమని.. చివరికి ఆయన కూడా కొట్టుకుంటాడని వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, టీడీపీ శ్రేణులను రక్షించే బాధ్యత తనదని చంద్రబాబు జోస్యం చెప్పారు.

First published:

Tags: Anantapur S01p19, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Chandrababu naidu

ఉత్తమ కథలు