హోమ్ /వార్తలు /national /

తెలుగోళ్లకు దగ్గరయ్యారు.. అమిత్ షాకు చంద్రబాబు థ్యాంక్స్..

తెలుగోళ్లకు దగ్గరయ్యారు.. అమిత్ షాకు చంద్రబాబు థ్యాంక్స్..

అమిత్ షా, చంద్రబాబు

అమిత్ షా, చంద్రబాబు

Amaravati : అమరావతి పేరును సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో చేర్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

  అమరావతి పేరును సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో చేర్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటగా అమిత్ షాకు ‘ముందుగా ఇండియా మ్యాప్‌లో చేర్చకుండా ఉన్న అమరావతి పేరును చేర్చేందుకు హోం శాఖ తీసుకున్న చర్యలు భేష్. ఇందుకు కృతజ్ఞతలు. అమరావతిని మ్యాప్‌లో చేర్చి తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు.’ అని అన్నారు. అనంతరం తెలుగు బిడ్డ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడా థ్యాంక్స్ చెప్పారు. ‘అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా అమరావతిపై స్పందించి, చర్యలు తీసుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఙతలు. మీ ప్రయత్నం గుర్తించదగినది’ అని ట్వీట్ చేశారు.


  కాగా.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో దీనిపై ప్రస్తావిస్తూ.. ‘2019 అక్టోబరు 21న కేంద్ర హోంశాఖ ఇండియా న్యూ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఆ చిత్రపటాన్ని చూసి మేమంతా షాక్‌కు గురయ్యాం. ఎందుకంటే ఆ మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతి లేదు. ఇది ఏపీ ప్రజలకే కాదు.. ప్రధాని మోదీకి కూడా అవమానకరం. 2015లో ఆయనే రాజధానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశముంది. ఈ సమస్యను పరిష్కరించి మళ్లీ కొత్త మ్యాప్‌ను విడుదల చేయాలి’ అని అన్నారు. ఆ వెంటనే సర్వే ఆఫ్ ఇండియా అమరావతి పేరును చేర్చుతూ కొత్త మ్యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Amaravati, Amit Shah, Bjp-tdp, Chandrababu Naidu

  ఉత్తమ కథలు