హోమ్ /వార్తలు /national /

Chandrababu Naidu: డీజీపీ వ్యవహారం చూస్తా.. నిమ్మగడ్డను ఏడిపిస్తున్నారంటూ చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu: డీజీపీ వ్యవహారం చూస్తా.. నిమ్మగడ్డను ఏడిపిస్తున్నారంటూ చంద్రబాబు ఫైర్

సీఎం జగన్ ఒక పోటుగాడులా వ్యవహరిస్తున్నారు. మండలిని మొన్నగాక మొన్న రద్దుఅని ప్రకటించి నేడు వాళ్ల పార్టీ నేతలతో నామినేషన్లు వేయిస్తున్నారు.. అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్ ఒక పోటుగాడులా వ్యవహరిస్తున్నారు. మండలిని మొన్నగాక మొన్న రద్దుఅని ప్రకటించి నేడు వాళ్ల పార్టీ నేతలతో నామినేషన్లు వేయిస్తున్నారు.. అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్ ఒక పోటుగాడులా వ్యవహరిస్తున్నారు. మండలిని మొన్నగాక మొన్న రద్దుఅని ప్రకటించి నేడు వాళ్ల పార్టీ నేతలతో నామినేషన్లు వేయిస్తున్నారు.. అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

  అమరావతి: డీజీపీ వ్యవహారం చూస్తానంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అరెస్ట్, విడుదల వ్యవహారం, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, డీజీపీ వైఖరి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై ప్రభుత్వం కక్షసాధింపు వంటి అంశాలపై గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన జరుగుతోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటని డీజీపీని ప్రశ్నించారు. రామతీర్థానికి రెండో తారీఖున తాను వెళ్లిన తర్వాతే ప్రభుత్వం కదిలిందనీ, లా అండ్ ఆర్డర్ పై తనకు బాధ్యత లేదన్నట్టుగా డీజీపీ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రాముడి విగ్రహం తల నరికితే నేను ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. ఏపీలో అమలవుతున్నది ఇండియన్ పీనల్ కోడ్ నా? లేదా జగన్ పీనల్ కోడ్ నా? అని సూటి ప్రశ్న వేశారు.

  ’రాష్ట్రంలో ఓటు బ్యాంక్ అనే కుట్ర జరుగుతోంది. కళా వెంకట్రావు వివాద రహితుడు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారా? ధర్మ పరిరక్షణ కార్యక్రమం మేము చెయ్యకూడదా? మమ్మల్ని అందర్నీ జైల్లో పెట్టండి? ప్రజలు అందర్నీ కూడా జైల్లో పెట్టండి. డీజీపీ సమాధానం చెప్పాలి? ఏం తమాషా చేస్తున్నారా? రామ తీర్థం వెళ్ళినప్పుడు నన్ను అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. కళా వెంకట్రావుని అరెస్ట్ చేసిన విధానం, కేసు పెట్టిన విధానం సరికాదు. డీజీపీ తప్ప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. రాముడి విగ్రహం తల నరికితే కోపం రాదా.? నా కాన్వాయ్ పై రైతులు చెప్పులు విసిరారు అని అంటున్నారు. చెప్పులు విసిరేంత కోపం నాపైన రైతులకు లేదు. రౌడీ మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక సీఎం, ఒక డీజీపీ, ఒక హోం మంత్రి ఒకే మతం వాళ్లు అయి ఉంటే ఏం జరుగుతుందో నిరూపించారు‘ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండని ఆయన హితవు పలికారు.

  దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడం చేతగాక తమ మీద ఆరోపణలు చేస్తారా.. అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. తనకు తాను ఓ మోనార్క్ ని అని డీజీపీ అనుకుంటున్నారనీ, క్రిష్టియన్ లతో నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి తిరుపతిలో నిన్న అనుమతి ఇచ్చి ఈ రోజు ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ట్రంప్ అనే ఓ సైకోను అమెరికా ప్రజలు తిరస్కరించారనీ, ఏపీలో కూడా అదే పరిస్థితి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక విధ్వంసం నుంచి రాష్ట్రంలో విధ్వంసాలు మొదలయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

  ’ఎస్, నేను హిందూ, సీఎం జగన్ క్రిస్టియన్. డీజీపీ.. మత విద్వేషాలు రెచ్చ గొట్టేది మీరు. మత సామరస్యానికి ఆటంకం కలిగించేది మీరు. అందరూ సహకరిస్తేనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటుంది. ప్రజల సహకారంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చెయ్యమని మా కార్య కర్తలకు పిలుపు ఇచ్చాం. టీడీపీ, బీజేపీ కార్యకర్తల అనుమానాస్పద మృతులపై డీజీపీ ఎందుకు స్పందించడం లేదు‘ అని చంద్రబాబు నిలదీశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు.. ఏమైంది? ఎక్కడుంది? ఇన్సైడర్ అనే పదం అస్సలు ఉందా?.. అని ప్రశ్నించారు. డీజీపీ తనకు వ్యక్తిగతంగా తెలుసుననీ, మంచివాడేననీ, కాకపోతే పదవుల కోసమే ఇవన్నీ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పదవి శాశ్వతం కాదన్నది డీజీపీ గుర్తుపెట్టుకోవాలన్నారు. గుడివాడ ఎస్సై విజయ కుమార్ మృతి ఒక మిస్టరీగా మారిందనీ, గుడివాడలో పేకాట దాడుల్లో ఆయనే కీలక పాత్ర పోషించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

  రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందనీ, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. డీజీపీ ఇప్పటికైనా సక్రమంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ఆయన హితవుపలికారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎంత ఏడిపించారో గుర్తు చేసుకోవాలన్నారు. ‘సీఎం జగన్ ఒక పోటుగాడులా వ్యవహరిస్తున్నారు. మండలిని మొన్నగాక మొన్న రద్దుఅని ప్రకటించి నేడు వాళ్ల పార్టీ నేతలతో నామినేషన్లు వేయిస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యం శాశ్వతం. సీఎం వ్యవహారం చూస్తుంటే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు ఆయనే కండక్ట్ చేసేలా ఉన్నాడు. ఈ డీజీపీ వ్యవహారం చూస్తా. జడ్జ్ లు మారినంత మాత్రాన జస్టిస్ మారదు. చట్టాలను ఉల్లంఘించిన పరిస్తితి ఏ రాష్ట్రంలో అయినా ఉందా.? నేను సవాలు చేస్తున్నాను. తుపాకులతో పరిపాలన చేయలేరు. చట్టాలను చేతుల్లోకి తీసుకునే వారి గుండెల్లో నేను నిద్రపోయా. ఎంతమందిని చంపుతారో చంపండి. అవసరమయితే శాశ్వతంగా జైల్లో ఉంటా. రాష్ట్రంలో ఒక మతంపై దాడులు చేస్తున్నారు? ఎందుకు? దేన్నీ ఆశించి ఇలా చేస్తున్నారు. దాడులపై నేను మాట్లాడ కూడదా?‘ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  శ్రీకాకుళం ఘటనలో అమాయకులని అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. క్రైస్తవ సంఘాలకు రాజకీయాలతో ఏం పని? అని ప్రశ్నించారు. వైఎస్ విగ్రహం వద్దు అని నంద్దేశ్వరుని విగ్రహం పెట్టడం తప్పా? అని నిలదీశారు. దాడులకు తాను భయపడననీ, నిర్మొహమాటంగా మాట్లాడే గుణం తనదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పోలీస్ అధికారులు, సిబ్బంది మనసును చంపుకుని డ్యూటీ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, AP DGP, AP Temple Vandalism, Chandrababu Naidu

  ఉత్తమ కథలు