తస్లీమా నస్రీన్ (Taslima Nasreen).. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. ఇస్లాం(Islam)ను విమర్శించి ఫత్వా ఎదుర్కొంటున్న ఈ బంగ్లాదేశ్(Bangladesh) రచయిత్రి 25 ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఎప్పుడో తప్ప వార్తల్లోకి ఎక్కని తస్లీమా తాజాగా ఆప్ఘనిస్తాన్(Afghanistan)లో తాలిబాన్ల చర్యలపై విమర్శలు గుప్పిస్తోంది. అక్కడి మహిళలను రక్షించండని(save) కోరుకుంటోంది. ట్విటర్ (tweeter) వేదికగా తన గళాన్ని వినిపిస్తోంది. అయితే తన మాటల పదునును ఈ సారి పాకిస్తాన్(Pakistan) ప్రధాని ఇమ్రాన్‌ఖాన్(Imran khan)పై ఉపయోగించింది. తాలిబన్ల విషయంలో ఇమ్రాన్ వైఖరి(attitude)ని తస్లీమా తప్పుబట్టింది(blame). పాకిస్తాన్ ప్రధాని(prime minister) ఇమ్రాన్‌ఖాన్‌కు కూడా కొడుకుల బదులు కూతుర్లు ఉండి తీరాల్సిందని అన్నారు. ఆ కూతర్లు కూడా ఎక్కడో యూకే(UK)లో కాకుండా ఆప్ఘనిస్తాన్‌లో ఉండి ఉంటే బాగుండేదని ఆమె విమర్శలు(satires) గుప్పించారు.
ఇంతకీ ఇమ్రాన్ ఏమన్నారంటే..
తాలిబన్లు సైనిక సంస్థ కాదని, సామాన్య పౌరులేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. పాక్ సరిహద్దుల్లో 30 లక్షల మందికి పైగా ఆప్గాన్ శరణార్ధులు ఉన్నారని....వారిని ఎలా తుదముట్టించాలని కోరుతానని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి ఓ న్యూస్ చానల్‌తో ఆయన మాట్లాడుతూ... ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు అక్కడ 5 లక్షల మందితో కూడిన శిబిరాలు ఉన్నాయని, తాలిబన్లు సైనిక సంస్థ కాదని, వారు సాధారణ పౌరులేనని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో కొంత మంది పౌరులు ఉంటే...పాకిస్తాన్ వారిని ఎలా తుదిముట్టిస్తుందని, వాటిని అభయారణ్యాలుగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటంలో తాలిబన్లకు సైనిక,ఆర్థికపరమైన సాయాన్ని పాక్ అందిస్తోందన్న వార్తలను ఆయన ఖండించారు. ఆప్గనిస్తాన్‌లో అమెరికాతో యుద్ధం జరిగే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 2001, సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లో జరిగిన దానికి తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. దీంతో తస్లీమా ఇమ్రాన్‌ఖాన్‌పై మండిపడింది. ‘‘పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాలిబన్లను ప్రేమిస్తారు. 'తాలిబన్ బానిస సంకెళ్లను విచ్ఛిన్నం చేసింది’ అని అన్నారు. 'ఇమ్రాన్ ఖాన్‌కు ఇద్దరు కుమారులకు బదులుగా ఇద్దరు కుమార్తెలను కలిగి ఉంటే, అందులోనూ వారు యూకే (UK)లో కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో నివసిస్తుంటే?”అని ట్విటర్లో ప్రశ్నించారు.
Pakistan's PM Imran Khan loves Taliban. He says 'Taliban has broken shackles of slavery. ' What if Imran Khan had two daughters instead of two sons, and they live not in UK, but in Afghanistan?
— taslima nasreen (@taslimanasreen) August 16, 2021
గతంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయీన్‌ఖాన్‌ను ఉద్దేశించి కూడా చేసిన ట్వీట్‌తో తస్లీమా వార్తల్లోకి వచ్చింది. తన జెర్సీ నుంచి బీర్ బ్రాండ్ లోగోను తొలగించమని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ను మొయీన్ కోరినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను సీఎస్‌కే ఖండించింది. ఈలోపు ఈ మధ్యలోకి తస్లీమా చొచ్చుకొచ్చారు. మొయీన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘మొయీన్ కనుక క్రికెటర్ కాకపోయి ఉంటే సిరియా వెళ్లి ఐసీస్‌లో చేరి ఉండేవాడు’’ అని ట్వీట్ చేశారు. అయితే ఆసారి మాత్రం ఆప్ఘన్ మహిళలకు అండగా ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు తస్లీమా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, FIRE, Imran khan, Pakistan, Trolling, Tweets, Viral tweet