ప్రతీ ఏడాది చాలామంది తమ బర్త్ డేలు.. మ్యారేజ్ యానివర్శరీలు సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇక ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్తగా బ్రేకప్ డేలు... ఎంగేజ్ మెంట్ డేలు... కూడా చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ కొత్త ట్రెండ్ ప్రారంభించాడు. చెంగల్ పట్‌కు చెందిన ఓ వ్యక్తి... పెట్టిన పోస్టర్లు ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని చెంగల్‌పేట్‌లో ఓ వ్యక్తి మూడు దశాబ్దాలకు పైగా మద్యపానానికి బానిసగా మారాడు.
అయితే ఓ సంవత్సరం నుంచి అతడు ఆల్క్‌హాల్ తాగడం మానేశాడు. అయితే ఈ సందర్భంగా మందు మానేసి ఏడాది అయిన సందర్భంగా గోడలపై పోస్టర్‌లను ప్రదర్శించాడు. సాధారణంగా వివాహాలు, పుట్టినరోజులు, మరణాలు వంటి సందర్భాలను గుర్తించుకోవడానికి వార్షికోత్సవాలు జరుపుకుంటారు. అయితే ఈ వ్యక్తి సరికొత్తగా మందుకు దూరమై ఏడాది దాటిందని... వార్షికోత్సవంపై పోస్టర్లు పెట్టడం నగరంలో హాట్ టాపిక్‌గా దారితీసింది.
53 ఏళ్ల మనోహరన్ అనే వ్యక్తి తమిళనాడులోని చెంగల్‌పేట జిల్లా అత్తూరు పరిసరాల్లో నివసిస్తున్నారు. 32 ఏళ్లుగా మద్యానికి బానిసైన మనోహరన్ గతేడాది మద్యం సేవించడం మానేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 26, 2022 నుంచి మద్యం సేవించడం మానేశాను. ఒక సంవత్సరం పాటు మద్యం తీసుకోవడం లేదని మనోహరన్ చెప్పారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మద్యపానంకు దూరంగా ఉండాలన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, మనోహరన్ పట్టణం అంతటా పోస్టర్లు వేశారు. అంతేకాదు పోస్టర్‌లను ప్రదర్శించడానికి, అతను వేరే చోట స్పాన్సర్‌ను కూడా కనుగొన్నాడు.
'మద్యం తాగడం వల్ల పట్టణంలోనే కాదు తన కుటుంబంలో కూడా తనకు గౌరవం పోయింది' అని మనోహరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మద్యం కోసం రోజూ రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు చేశానని తెలిపాడు. 'చివరికి, తన ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన దీన పరిస్థితి వచ్చిందని తెలిపాడు. ఇప్పుడు మద్యపానం మానేశాను, ఇంట్లో మరియు ఇరుగుపొరుగు, బంధువులలో గౌరవం పెరిగిందని తెలిపారు. తన ఆరోగ్యం కూడా స్థిరంగా ఉందన్నారు. మద్యం సేవించడం వల్ల జరిగే దుష్పరిణామాలపై ఇతరులకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు అంటించానని తెలిపారు. మద్యం తాగేవారు సంస్థలను విడిచిపెడితే, ప్రభుత్వ అధికారులు ఆటోమేటిక్‌గా మద్యం షాపులను మూసివేస్తారు' అని మనోహరన్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.