Home /News /national /

POLITICS TAMIL NADU CM SPEAKS TO NETWORK 18 MADE SOME INTRESTING COMMENTS ON NATIONAL POLITICS PVN

సీఎం అయ్యాక తొలిసారి..న్యూస్ 18 ఇంటర్వ్యూలో జాతీయ రాజకీయాలపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

న్యూస్ 18 తమిళనాడు ఇంటర్వ్యూలో స్టాలిన్

న్యూస్ 18 తమిళనాడు ఇంటర్వ్యూలో స్టాలిన్

Tamil Nadu CM Interview : తమిళనాడు ముఖ్యమంత్రి(Tamilnadu CM)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వని డీఎంకే అధినేత,సీఎం MK స్టాలిన్(MK STALIN) ఇప్పుడు తొలిసారి న్యూస్ 18 తో మాట్లాడారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Tamil Nadu CM Interview : తమిళనాడు ముఖ్యమంత్రి(Tamilnadu CM)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వని డీఎంకే అధినేత,సీఎం MK స్టాలిన్(MK STALIN) ఇప్పుడు తొలిసారి న్యూస్ 18 తో మాట్లాడారు. న్యూస్ 18 తమిళనాడుతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం స్టాలిన్(CM Stalin)..2024 పార్లమెంట్ ఎన్నికల కోసం తన వ్యూహాన్ని వివరించారు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో(2024 Loksabha Elections) తమ పార్టీ(DMK) రాస్ట్రంలోని మొత్తం 40 స్థానాలను గెల్చుకుంటుందని ధీమ వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి తమ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 2024లో కింగ్‌గా ఉండాలనుకుంటున్నారా? కింగ్‌మేకర్‌గా ఉండాలనుకుంటున్నారా అని ప్రత్యేకంగా అడిగినప్పుడు.."తమ స్థాయి గురించి మనం తెలుసుకోవాలని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటేవాడు. నా గురించి నాకు తెలుసు"అంటూ స్టాలిన్ గుప్తంగా సమాధానమిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ తన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలకు కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ ఎన్నికల తర్వాత డీఎంకే ఆప్షన్‌లను తెరిచి ఉంచుతుందని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని సూచించాడు. బీజేపీతో ఎలాంటి రాజీ ఉండబోదని మాత్రం స్టాలిన్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులందరితో తాను టచ్‌లో ఉన్నానని, ప్రస్తుతం ఉన్న కూటమి మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. అయితే ప్రతిపక్ష ఐక్యతకు కాంగ్రెస్‌కు మూలాధారం కాగలదా అనే సూటి ప్రశ్నను మాత్రం డీఎంకే అధినేత సమాధానం దాటవేశారు. Viral Video : విమానంలో పాక్ యువకుడు రచ్చ రచ్చ..సంకెళ్లు వేసి కట్టేసిన సిబ్బంది! తమిళనాడు తన పాలనను సమానత్వం- సమగ్రతను సూచించే ద్రావిడ మోడల్‌గా పేర్కొనడాన్ని తాను ఇష్టపడతానని స్టాలిన్ అన్నారు. ద్రవిడ పాలనా విధానం అంటే మహానుభావులు, అన్నాదురై, కరుణానిధి పాలనల కలయిక తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. ఇక,రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును సమర్థిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో గత ఏఐఏడీఎంకే ప్రభుత్వాల పాలనాపరమైన నిర్లక్ష్యం కారణంగా అప్పులు పేరుకుపోవడంతో విద్యుత్ టారిఫ్‌లను పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో విద్యుత్‌ ఛార్జీలు ఇప్పటికీ చౌకగా ఉన్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: MK Stalin, Tamilnadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు