Home /News /national /

POLITICS TAMIL NADU CM MK STALIN THREATENS TO BECOME DICTATOR FOR OFFICIALS INVOLVED IN MALPRACTICES PVN

MK Stalin : నియంతలా మారి వాళ్ల అంతు చూస్తా..సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

MK Stalin Warning : గతేడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టింది డీఎంకే(DMK)పార్టీ. కరుణానిధి కుమారుడు,ఎంకే స్టాలిన్(MK Stalin)నేతృత్వంలో డీఎంకే పార్టీ.. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే సొంతంగా 133 సీట్లు గెలుచుకుంది. అయితే గతేడాది సీఎంగా పగ్గాలు చేపట్టినరోజు నుంచి పాలనలో తనదైన ముద్రవేస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు సీఎం స్టాలిన్.

ఇంకా చదవండి ...
  MK Stalin Warning : గతేడాది తమిళనాడు(Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టింది డీఎంకే(DMK)పార్టీ. కరుణానిధి కుమారుడు,ఎంకే స్టాలిన్(MK Stalin)నేతృత్వంలో డీఎంకే పార్టీ.. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే సొంతంగా 133 సీట్లు గెలుచుకుంది. అయితే గతేడాది సీఎంగా పగ్గాలు చేపట్టినరోజు నుంచి పాలనలో తనదైన ముద్రవేస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు సీఎం స్టాలిన్. ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలకు ప్రజలు ఫిదా అవుతున్నారు. విపక్షాలు సైతం సీఎంని కొన్ని సందర్భాలలో ప్రసంశించకుండా ఉండలేని పరిస్థితి. అయితే ఎప్పుడూ కూల్ గా కనిపించే సీఎం ఎంకే స్టాలిన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఓ డిక్టేకర్ లా మారుతా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే స్టాలిన్ ఎవరిని హెచ్చరించారు?స్టాలిన్ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

  ఆదివారం తమిళనాడులోని నమక్కల్(Namakkal)లో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల సదస్సునుద్దేశించి స్లాలిన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్రమాలకు(Irregularities)పాల్పడితే తాను నియంతలా మారి కఠిన చర్యలు తీసుకుంటానని సీఎం స్టాలిన్​ హెచ్చరించారు. రూల్స్ పాటించకపోయినా,అక్రమాలకు పాల్పడినా పార్టీపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో స్టాలిన్ మాట్లాతుతూ..." నేను చాలా ప్రజాస్వామ్యంగా మారిపోయానని నా సన్నిహితులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే అందరి అభిప్రాయాలను వినడం, గౌరవించడం. ప్రజాస్వామ్యం అంటే ఎవరినీ ఏమీ చేయలేకపోవడం కాదు. క్రమశిక్షణారాహిత్యం, అక్రమాలు పెరిగితే నేను నియంతగా మారి చర్య తీసుకుంటాను. నేను ఈ విషయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే కాదు అందరికీ చెబుతున్నాను. క్రమశిక్షణారాహిత్య,అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే డిక్టేటర్ గా మారడానికి వెనకాడను..వారిపై కొరడా దెబ్బలు ఝులిపిస్తాను. రాష్ట్రంలో డీఎంకే పార్టీ అంత తేలిగ్గా అధికారాన్ని చేజిక్కించుకోలేదు. కోట్లాది మంది పార్టీ కార్యకర్తల నిస్వార్థ కృషి ఫలితంతోనే అధికారంలోకి వచ్చాం. నేను కూడా గత ఐదు దశాబ్దాలుగా చేసిన కృషితోనే ముఖ్యమంత్రి అయ్యాను. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించి, 1989లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. అది మీరు గుర్తుంచుకోండి. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి. ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే సామాన్య ప్రజలు బహిష్కరిస్తారనే విషయం మర్చిపోవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆరోపణలు ఉండకూడదు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని పనిచేసినప్పుడే వారు అండగా నిలుస్తారు.రాష్ట్రంలో డీఎంకే పార్టీ అంత తేలిగ్గా అధికారాన్ని చేజిక్కించుకోలేదు. కోట్లాది మంది పార్టీ కార్యకర్తల నిస్వార్థ కృషి ఫలితంతోనే అధికారంలోకి వచ్చాం. నేను కూడా గత ఐదు దశాబ్దాలుగా చేసిన కృషితోనే ముఖ్యమంత్రి అయ్యాను. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించి, 1989లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. ప్రజల మన్ననలు పొందడం కష్టసాధ్యం. గత 50 ఏళ్లుగా తాను ప్రజల మధ్యే పనిచేస్తున్నాన అది మీరు గుర్తుంచుకోండి. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి. మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను భర్తలకు అప్పజెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని"అని సూచించారు.  Shocking : కొద్ది రోజుల్లో పెళ్లి..లాడ్జిలో ప్రియురాలితో శృంగారం చేస్తూ స్పృహ తప్పి యువకుడు మృతి!

  అంతకుముందు,డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాతో ఎంపీ రాజా మాట్లాడుతూ...తమిళనాడు రాష్ట్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని మోదీ,అమిత్ షాలను కోరారు. ప్రత్యేక దేశం కావాలని కోరుకునేలా తమను నెట్టవద్దని కోరారు. పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధుల పార్టీ సమావేశంలో రాజా మాట్లాడుతూ, ద్రావిడ ఉద్యమానికి ఐకాన్..పెరియార్ స్వతంత్ర తమిళనాడు కోసం నిలబడినప్పటికీ, డీఎంకే దానికి దూరంగా ఉందన్నారు. పార్టీ... పెరియార్‌ సమగ్రత, ప్రజాస్వామ్యాన్ని అంగీకరించినప్పటి భారతదేశం చిరకాలం కలిసి జీవించాలని డీఎంకే చెప్పిందని. పార్టీ ఆ రేఖకు కట్టుబడి ఉందన్నారు.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: MK Stalin, Tamilnadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు