Home /News /national /

POLITICS TAMIL ACTOR AJITH DENIES JOINING BJP

అజిత్ బీజేపీలో చేరుతారా? క్లారిటీ ఇచ్చిన తమిళ హీరో

శివ దర్శకత్వంలో అజిత్ నటించిన నాలుగో సినిమా ‘విశ్వాసం’. ఈ చిత్రం తమిళనాట విజయం సాధించింది కానీ తెలుగులో మాత్రం అజిత్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. నయనతార హీరోయిన్‌గా నటించింది ఈ చిత్రంలో.

శివ దర్శకత్వంలో అజిత్ నటించిన నాలుగో సినిమా ‘విశ్వాసం’. ఈ చిత్రం తమిళనాట విజయం సాధించింది కానీ తెలుగులో మాత్రం అజిత్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. నయనతార హీరోయిన్‌గా నటించింది ఈ చిత్రంలో.

త్వరలో తాను బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన తమిళ హీరో అజిత్...రాజకీయాలతో తనకు సంబంధమున్న ఏకైకా అంశం క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కుని వినియోగించుకోవడం మాత్రమేనని స్పష్టంచేశారు.

    తమిళ హీరో అజిత్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారని, ఆయన బీజేపీతో చేరుతారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అజిత్‌ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కమలనాథులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆయన కమలదళంలో చేరుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అజిత్ అభిమానుల సంఘాలకు చెందిన కొందరు బీజేపీ తమిళనాడు రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై సౌందరరాజన్...అజిత్ చాలా నిజాయితీ కలిగిన నటుడంటూ ప్రశంసల జల్లుకురిపించారు. ప్రజలకు అజిత్ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. అజిత్, ఆయన అభిమానులు ప్రధాని మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె వ్యాఖ్యలతో అజిత్ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం మరింత జోరందుకుంది.

    దీనిపై స్పందించిన అజిత్...తాను బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. నటించడమే తన ఏకైక వృత్తిగా అజిత్ పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు, తన అభిమానులకు రాజకీయ రంగు పులమకూడదన్న ఉద్దేశంతోనే కొన్నేళ్ల క్రితం తన అభిమానుల సంఘాలన్నిటినీ రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో అజిత్ గుర్తుచేశారు. ఎన్నికలకు ముందుగా ఇలాంటి అవాస్తవ కథనాలను ప్రచురించడం మీడియాకు తగదన్నారు. దీని ద్వారా తప్పుడు సంకేతాలు వళ్లే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తకు లేదని స్పష్టంచేశారు. తనకు రాజకీయాలతో సంబంధమున్న ఏకైక అంశం...క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకోవడం మాత్రమేనన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీ పట్లా ప్రత్యేక అభిమానం లేదని అజిత్ ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అజిత్ స్పష్టంచేశారు.

    First published:

    Tags: Ajith, Bjp, Tamilnadu

    తదుపరి వార్తలు