ఇటీవల బోనాల వేడుక సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో తలసాని హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే ఆ సమయంలో తలసాని మద్యం మత్తులో ఉన్నారని.. అందుకే అంత ఉత్సాహంగా డ్యాన్స్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 'మందు బాబులం మేం మందుబాబులం' పాటతో ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా దీనిపై స్పందించిన తలసాని.. ఆ ప్రచారాన్ని ఖండించారు. తనకు మద్యం అలావాటు లేదని.. ఆడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ ఏటా బోనాలకు తాను డ్యాన్స్ చేస్తానని.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చేశానని తెలిపారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Talasani Srinivas Yadav, Trs