హోమ్ /వార్తలు /జాతీయం /

భారత వాయుసేనపై ప్రశంసల జల్లు...దేశం సంబరాలు చేసుకోవాలన్న మోదీ

భారత వాయుసేనపై ప్రశంసల జల్లు...దేశం సంబరాలు చేసుకోవాలన్న మోదీ

ప్రధాని మోదీ (ANI)

ప్రధాని మోదీ (ANI)

Surgical Stike2: ఈరోజు భారతదేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజున్నారు ప్రధాని. జాతి నిర్మాణంలో భాగస్వామ్యులైన వారందరికి ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నా అన్నారు.

    రాజస్థాన్ చురులో పర్యటించిన మోదీ భారత వైమానిక దాడులపై స్పందించారు. మెరుపు దాడుల వీరులకు శిరస్సు వంచి నమస్కరిద్దామన్నారు. దేశానికి, జాతికి ఎన్నటికి తలవంపులు తీసుకురానన్నారు. సగర్వ భారతవని తల ఎత్తుకునే ఉంటుందన్నారు. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందనే విశ్వాసాన్ని నేను ఇస్తున్నా అన్నారు. దేశం మేల్కొని ఉందన్నారు మోదీ. ప్రతీ భారతీయుడికి విజయం లభిస్తుందన్నారు. ఈరోజు భారతదేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజున్నారు ప్రధాని. జాతి నిర్మాణంలో భాగస్వామ్యులైన వారందరికి ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నా అన్నారు. సైనిక సంక్షేమాన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన అనేకమంది ఆర్మీలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. వ్యక్తి కన్నా పార్టీ గొప్పది... పార్టీ కన్నా దేశం గొప్పదన్న భావనతో పనిచేస్తున్నామన్నారు. దేశ గౌరవ మర్యాదల్ని మంటగలిపే చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు ప్రధాని. భారత జాతి ప్రయాణం ఆగదన్నారు. విజయవంతంగా ఈ ప్రయాణం కొనసాగుతుందన్నారు మోదీ.

    First published:

    Tags: Indian Air Force, Jammu and Kashmir, Pakistan, Pm modi, Pulwama Terror Attack, Surgical Strike 2

    ఉత్తమ కథలు