హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ ఎంపీకి ఎదురుదెబ్బ

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ ఎంపీకి ఎదురుదెబ్బ

rahul gandhi

rahul gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. 2019లో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వేసిన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. 2019లో మోదీ(Modi)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వేసిన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. దొంగలందరి ఇంటి పేరు మోదీనే ఎందుకని రాహుల్‌ గాంధీ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ పరువునష్టం దావా వేయడంతో సూరత్ (Surat)కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చింది.

రాహుల్‌గాంధీకి జైలుశిక్ష..

కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు, వాయినాడ్ ఎంపీ రాహుల్‌గాంధీకి పరువునష్టం కేసులో చుక్కెదురైంది. 2019ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ 2019లో సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. ఈకేసులో రాహుల్‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉండటంతో సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రాహుల్‌గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దొంగలందరికి ఇంటి పేరు మోదీ అని ఎందుకు వచ్చిందని కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ర్యాలీ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోఈ కామెంట్ చేశారు.ఆ కాంట్రవర్సీ కామెంట్స్‌ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.

నేరపూరిత వ్యాఖ్యలుగా..

సూరత్ కోర్టు పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీని ఐపీసీ సెక్షన్ 504 కింద దోషిగా నిర్ధారించి, ఈ సెక్షన్ కింద గరిష్ఠ శిక్షను ఖరారు చేసింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.అయితే రాహుల్‌గాంధీపై నేరం నిరూపించడం, జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పివ్వడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఇది అప్రజాస్వామికమని మండిపడుతున్నారు.

నాటి మాటకు..నేడు శిక్ష పడింది..

ఈకేసులో రెండు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుగా తేల్చింది. తన వ్యాఖ్యల ద్వారా మొత్తం మోదీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానపరిచినట్లుగా భావించింది. ఈకేసులోనే రాహుల్‌గాంధీ నేడు కోర్టు విచారణకు హాజరయ్యారు. కోర్టు దగ్గర భారీ సెక్యురిటీ ఏర్పాటు చేశారు.

First published:

Tags: National News, Rahul Gandhi

ఉత్తమ కథలు