Home /News /national /

POLITICS SUPREME COURT GIVES VERDICT ON MAHARASHTRA ASSEMBLY FLOOR TEST AFTER LISTENING HEARING PLEAS OF SHIV SENA SHINDE GROUP AND GOVERNOR AK

Supreme Court on Maharashtra: మహారాష్ట్ర ఎపిసోడ్‌లో కొత్త మలుపు.. బలపరీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఉద్ధవ్ సర్కార్ పనైపోయినట్టేనా ?

బీజేపీ ఫడ్నవిస్ తో శివసేన రెబల్ ఏక్ నాథ్ షిండే, సీఎం ఠాక్రే (పాత ఫొటోలు)

బీజేపీ ఫడ్నవిస్ తో శివసేన రెబల్ ఏక్ నాథ్ షిండే, సీఎం ఠాక్రే (పాత ఫొటోలు)

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

    మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రేపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కోష్యారి ఆదేశించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై సర్వతా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు రేపు బలపరీక్ష చేపట్టాలన్ని గవర్నర్ ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించింది. బలపరీక్షపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బలపరీక్షపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. దీంతో రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరగడానికి లైన్ క్లియర్ అయ్యింది. అనర్హత అరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షలో ఓటు వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

    అంతకుముందు సుప్రీంకోర్టులో శివసేన(Shiv Sena) తరపున సింఘ్వీ, షిండే (Eknath Shinde) తరపున నీరత్ కృష్ణ కౌల్ ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు. అసెంబ్లీలో బలపరీక్షను ఎప్పుడూ జాప్యం చేయకూడదని, రాజకీయ జవాబుదారీతనానికి, బేరసారాలు జరక్కుండా నిరోధించేందుకు బలపరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని షిండే తరఫు న్యాయవాది కౌల్ వాదించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం జాప్యమవుతోందన్న కారణం చూపించి బలపరీక్షను వాయిదా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత అంశం తేలాకే బలపరీక్షకు అనుమతివ్వాలని శివసేన తరపున న్యాయవాది సింఘ్వీ వాధించారు.



    బలపరీక్ష గురించి తమకు ఈరోజే సమాచారం అందిందని, బలనిరూపణకు ఒకరోజు మాత్రమే ఇవ్వడం అన్యాయమని సింఘ్వీ కోర్టుకు వాదన వినిపించారు. రెబల్ ఎమ్మెల్యేలను కాపాడేందుకే తెరపైకి బలపరీక్షను తీసుకొచ్చారని, తమ ఎమ్మెల్యేలు కొంతమంది విదేశాల్లో ఉన్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని సింఘ్వీ సుప్రీంకు వివరించారు. ఈ పరిస్థితిలో బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని సింఘ్వీ ప్రశ్నించారు. బలపరీక్షపై జులై 11న నిర్ణయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టును సింఘ్వీ కోరారు. అయితే షిండే తరపు న్యాయవాది వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించడంతో.. రేపు బలపరీక్షకు లైన్ క్లియర్ అయ్యింది.

    క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. మంత్రులకు థ్యాంక్స్ చెప్పిన సీఎం ఉద్ధవ్..

    BJP 2024: బీజేపీ బిగ్ ప్లాన్.. ఆ 144 సీట్లలో గెలిచేందుకు ప్రత్యేక వ్యూహం.. వీరికి బాధ్యతలు

    అయితే రేపు బలపరీక్షలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండటంతో.. ఆయన మరికాసేపట్లో ఫేస్ బుక్ లైవ్ ద్వారా కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. దీంతో ఆయన ఇప్పుడే తన రాజీనామా ప్రకటన చేస్తారా ? లేక రేపు అసెంబ్లీలో ఆయన ప్రసంగం చేసిన తరువాత రాజీనామా చేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Maharashtra, Shiv Sena, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు