హోమ్ /వార్తలు /national /

ఏపీకో బచావ్.. ఏపీకో బడావ్: సుజనా చౌదరి

ఏపీకో బచావ్.. ఏపీకో బడావ్: సుజనా చౌదరి

రాజ్యసభలో ప్రసంగిస్తున్న టీడీపీ ఎంపీ సుజనాచౌదరి

రాజ్యసభలో ప్రసంగిస్తున్న టీడీపీ ఎంపీ సుజనాచౌదరి

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఎలా చెబుతారని కేంద్ర ప్రభుత్వాన్ని సుజనా చౌదరి ప్రశ్నించారు.

ఏపీకో బచావ్.. ఏపీకో బడావ్ అంటూ రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి. ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలుపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిన చర్చను టీడీపీ ఎంపీ ప్రారంభించారు. రాష్ట్రానికి రూ.1.54లక్షల కోట్లు రావాల్సి ఉండగా, నాలుగేళ్లలో కేవలం రూ.13,700 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఆంధ్రావాళ్లు అడుక్కోవడం లేదని, విభజన చట్టంలో ఉన్నవాటిని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాటినే అమలు చేయాలని కోరుతున్నామన్నారు. నాలుగేళ్లుగా ఢిల్లీలోని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ప్రకటించిన ప్యాకేజీని ఎందుకు అమలు చేయలేదని సుజనా చౌదరి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఎలా చెబుతారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

మిత్రధర్మాన్ని విస్మరించిన మోదీ : సుజనా

ప్రధాని మోదీ మీద కూడా సుజనాచౌదరి విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం కోసం పెద్దలు క్విట్ ఇండియా ఉద్యమం చేస్తే.. ఇప్పుడు స్ల్పిట్ ఇండియా (విభజించడం) చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ.. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ న్యూ ఇండియాను నిర్మిస్తారా అని ప్రశ్నించారు. మిత్రధర్మాన్ని కూడా విస్మరించి ఏపీకి అన్యాయం చేయారని ఆరోపించారు. టీడీపీని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. వైసీపీతో స్నేహం చేస్తూ.. ఏపీలో అధికార పార్టీని తొక్కేయాలని చూస్తోందంటూ ఆరోపించారు.

First published:

Tags: AP Politics, AP Special Status, Bjp-tdp, Rajya Sabha

ఉత్తమ కథలు