ఊర్లలో, గ్రామాల్లో పండగలు, పెళ్లిళ్లలకు భోజనాలు పెట్టడం సర్వసాధారణంగా చూస్తుంటాం. పండగల సమయంలో, శుభకార్యాలు జరిగినప్పుడు.. ఊరిలో ఉన్నవారందరికీ ఇంటికి పిలిచి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. అయితే కర్నాటక రాష్ట్రంలో మాత్రం ఓ రైతు తమ వారందరికీ రుచికరమైన భోజనం పెట్టాడు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆహ్వానం పంపాడు. ఈ అరుదైన ఘటన విజయపూర్ నగర్ శివార్లలోని రంభాపుర గ్రామంలో చోటు చేసుకుంది. ఇక్కడ జాతర జరగకపోయినా.. పండగ వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలో మంచి వర్షాలు పడినా, రైతులకు సమృద్ధిగా పంటలు పండినా, గ్రామస్తులకు రోగాలు వచ్చి నయం అయినా.. ఇలాంటి ఆచారాలు కనిపిస్తాయి.
ఈ గ్రామంలో మెండెగర కుటుంబం.. ఏటా పండిన పంటను కోసి దేవుడికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ రైతన్న చేస్తున్న సంబరాలు.. హింగారు పంట పండిన సందర్భంగా చేస్తున్నవి. ఇక్కడ పంటలు పండిన వెంటనే వాటిని వినియోగించకుండా నేరుగా మార్కెట్ కు తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తుంటారు. రకరకాల వంటలు, అంబలి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ విశిష్ట సంప్రదాయం హోలీ పండుగ తర్వాత కనిపిస్తుంది. ముందుగా గ్రామ దేవుడైన ఆంజనేయుడికి ధవళాలు, ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇక్కడ, మొక్కజొన్న అంబలి, ఖడక్ రోటీ, వేరుశెనగ చట్నీ, సజ్జకా లేదా పాయసం, వంకాయ పల్య, పప్పుల పల్యాతో సహా వివిధ రకాల ఆహారాన్ని మట్టి పాత్రాల్లో పెట్టి..హనుమంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఓవైపు ముందుగా దేవుడికి రకరకాల ఆహారపదార్థాల నైవేద్యంగా పెట్టి... మరోవైపు వచ్చిన వారందరికీ భారీగా భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. పండ పండితేనే కదా రైతుకు నిజమైన పండగను ఇలా తమవాళ్లకు భోజనం పెట్టి ఇక్కడ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.