నేడు గుజరాత్ (Gujarat), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతుంది. గుజరాత్ (Gujarat) లో బీజేపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా..హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో బీజేపీ (Bjp)కి-కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. గుజరాత్ (Gujarat) లో వరుసగా ఏడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కాంగ్రెస్ ఓట్లను చీల్చింది. ఇది బీజేపీ (Bjp)కి కలిసొచ్చిన అంశం కాగా ఆప్ కు ఓట్ల శాతం 6 కు పైగా ఉంది. ఇక గుజరాత్ (Gujarat), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని 5 రాష్ట్రాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. అయితే ఆయా స్థానాల్లో ఉపఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
లక్ష ఓట్ల ఆధిక్యంలో డింపుల్ యాదవ్..
సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ మృతితో మెయిన్ పూరి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో SP తరపున అభ్యర్థిగా ఉన్న డింపుల్ యాదవ్ (Dimpil Yadav) సుమారు లక్ష ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుంది.
Gujarat Election Results :గుజరాత్ ఫలితాలతో దేశంలో వచ్చే మార్పులేంటి?
ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ శాసనసభ నియోజకవర్గంలో SP అభ్యర్థి అసిమ్ రాజా (Asim Raja0 ఆధిక్యంలో ఉన్నారు.
ఛత్తీస్ ఘడ్ లోని బానుప్రతాప్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి సావిత్రి మండి (Savitri Mandi) ముందజలో ఉన్నారు.
ఇక బీహార్ లోని కుర్హనీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కేదార్ గుప్తా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు ఓడిశాలోని పదంపూర్ లో బిజూ జనతా దళ్ అభ్యర్థి బర్ష సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రాజస్థాన్ లోని సర్ధార్ శహర్ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి అనిల్ కుమార్ శర్మ (Anil Kumar Sharma ) ముందజలో వున్నారు.
యూపీవోని ఖతొలి స్థానంలో ఎస్పీ మిత్రపక్షం ఆర్ఎల్డి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి ద్వితీయ స్థానంలో ఉండగా.. ఎస్పీ అభ్యర్థి మదన్ భయ్యా (Madhan bhayya) ముందజలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Assembly Elections 2022, Himachal Pradesh Elections 2022, Uttarapradesh