హోమ్ /వార్తలు /national /

అదిరిపోయే గుడ్ న్యూస్... పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్లు..ఎక్కడో తెలుసా !

అదిరిపోయే గుడ్ న్యూస్... పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్లు..ఎక్కడో తెలుసా !

రిమ్స్‌లో పసికందు అపహరణ

రిమ్స్‌లో పసికందు అపహరణ

రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు రెండో బిడ్డను కంటే.. వారికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తానని ప్రకటించింది. అలాగే మూడో బిడ్డను కంటే..రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని పేర్కొంది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad | Sikkim

భారతదేశ జనాభా వందకోట్లు ఎప్పుడో దాటేసింది. అయితే ... కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జనాభా చాలా తక్కువగా ఉంది. పిల్లల్ని కనాలంటే కొందరు వెనుకాడుతున్నారు. చాలామంది దంపతులు ఒక్కరితోనే సరి పెట్టుకుంటున్నారు. ఇద్దరు పుడితే వారిని పెంచడం, చదివించడం కష్టమని భావిస్తున్నారు. ఈ క్రమంలో తగ్గిపోతున్న తమ రాష్ట్ర జనాభాను పెంచేందుకు నడుం బిగించింది సిక్కీం సర్కార్. ఎక్కువమంది పిల్లల్ని కనేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు రెండో బిడ్డను కంటే.. వారికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తానని ప్రకటించింది. అలాగే మూడో బిడ్డను కంటే..రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని సిక్కీం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు.

దక్షిణ సిక్కీంలోని జోరెథాంగ్ సిటీలో ఆదివారం జరిగిన మాఘే సంక్రాంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు కృత్రిమంగా గర్భం దాల్చేలా తమ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రారంభించిందని సీఎం తమాంగ్ తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా పిల్లలకు జన్మనిచ్చే తల్లులందరికీ రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.

First published:

Tags: National, Sikkim