హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: అదంతా అసత్య ప్రచారం.. వాళ్లు చేసింది పెద్ద నేరం.. సిద్దిపేట సీపీ క్లారిటీ

Dubbaka ByPoll: అదంతా అసత్య ప్రచారం.. వాళ్లు చేసింది పెద్ద నేరం.. సిద్దిపేట సీపీ క్లారిటీ

జోయల్ డేవిస్

జోయల్ డేవిస్

నిన్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల నివాసాల్లో జరిగిన సోదాలు.. అనంతర పరిణామాలపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ జోయల్ డేవిస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

  నిన్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల నివాసాల్లో జరిగిన సోదాలు.. అనంతర పరిణామాలపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ జోయల్ డేవిస్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా నిన్నటి ఘటనలో పోలీస్ పై మీడియా చానల్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పోలీసులపై మీడియా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఎగ్జిగ్యూటీవ్ మెజిస్ట్రేట్ (తహసీల్దార్), ఏసీపీ నేతృత్వంలోని బృందాలు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ముందుగా నోటీసు ఇచ్చిన తర్వాతనే ఇళ్లలో తనిఖీలు చేశామన్నారు. తనిఖీల సమయంలో వీడియో, ఫొటోలు తీశామన్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారమే కావాలనే తమ సిబ్బందితో గలాటా చేసి డబ్బులు లాక్కున్నారని సీపీ అన్నారు.  పోలీస్ అధికారులు, సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ సంఘటనపై 27 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  సిద్దిపేట, మెదక్ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని సీపీ చెప్పారు. ఎవరు సమాచారం అందించినా అనుమానం ఉన్న ప్రతీ ఇంటిని తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు నాయకులు ఏదైనా సంఘటన గురించి తెలిస్తే డయల్ 100 కాల్ చేస్తే.. పది నిమిషాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేస్తారన్నారు. తప్పు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి మధ్యాహ్నం నుంచి జరుగుతున్న సంఘటన గురించి ఫోన్లో వివరించామన్నారు. సిద్దిపేటకు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ముందస్తుగా సమాచారం ఇచ్చామన్నారు. అయినా వినకుండా ఎంపీ సిద్దిపేట కు వచ్చే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకుని తిరిగి కరీంనగర్ పంపించామన్నారు.

  ఈ సందర్భంగా జరిగిన ప్రతీ విషయం సాక్షుల సంతకాలు తీసుకునే చేశామని స్పష్టం చేశారు. తనిఖీలు సురభి జితేందర్ రావు సమక్షంలోనే నిర్వహించామన్నారు. నిన్న నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేస్తే ఒక్కరి వద్దనే డబ్బులు దొరికాయన్నారు. అధికారులు సీజ్ చేసిన నగదును ఎత్తుకెళ్లాడం పెద్ద నేరమన్నారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చే వారిని ఎవరిని కూడా అడ్డుకోవడం చేయడం లేదని సీపీ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల కోసం అదనంగా పోలీస్ సిబ్బంది ఎర్పాటు చేశామన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bandi sanjay, Dubbaka By Elections 2020, Siddipet

  ఉత్తమ కథలు