హోమ్ /వార్తలు /national /

Tirupati ByPoll: పవన్ కళ్యాణ్‌కు షాక్.. తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ, పోటీలో మాజీ జనసేన నేత?

Tirupati ByPoll: పవన్ కళ్యాణ్‌కు షాక్.. తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ, పోటీలో మాజీ జనసేన నేత?

పవన్ కళ్యాణ్, సోమువీర్రాజు

పవన్ కళ్యాణ్, సోమువీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చింది బీజేపీ. తిరుపతిలో బీజేపీ అభ్యర్థినే నిలబెట్టడానికి డిసైడైంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చింది బీజేపీ. తిరుపతిలో బీజేపీ అభ్యర్థినే నిలబెట్టడానికి డిసైడైంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. తిరుపతిలో బీజేపీదే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో ఓబీసీల వర్గీకరణ జరగాలన్న లక్ష్మణ్.. బీసీల మద్దతుతో ఏపీలో కాషాయ జెండా ఎగరేస్తామని ప్రకటించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కానీ, వాటికి నిధులు మాత్రం కేటాయించలేదని లక్ష్మణ్ విమర్శించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా బీసీలు ఏకం కావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించడాలని పిలుపునివ్వడం ద్వారా అక్కడ బీజేపీ అభ్యర్థే బరిలో ఉంటారని లక్ష్మణ్ ప్రకటించారు.

తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ ఏపీలోని తిరుపతి లోక్‌సభ సీటు తమకు ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ అంశంపై రెండు పార్టీలు తీవ్ర తర్జన భర్జన తర్వాత ఓ కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ నిర్ణయం రాకముందే బీజేపీ నేతలు అక్కడ బీజేపీని గెలిపించాలని పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు మరో జాతీయ నేత కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్‌కు ఈసారి కూడా నిరాశ తప్పకపోవచ్చని చెబుతున్నారు.

తిరుపతి నుంచి పోటీకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. అక్కడ గతంలో బీజేపీ ఒకసారి గెలిచింది. తిరుపతిలో గెలవడం ద్వారా ఏపీలో బీజేపీకి కొత్త జోష్ తీసుకొచ్చి, టీడీపీకి ప్రత్యామ్నాయంగా మారాలని భావిస్తోంది. మరోవైపు అక్కడ ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసింది. అధికార పార్టీ వైసీపీ కూడా తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో వెంట ఉన్న ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి టికెట్ ఖరారు చేసినట్టు తెలిసింది. దీనిపై జనవరి 9న అధికారిక ప్రకటన చేయనున్నారు.

2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి చెందిన వారిని బరిలోకి దింపాలని మొదట భావించిన వైసీపీ గురుమూర్తి పేరును తెరపైకి తెచ్చింది. దుర్గాప్రసాద్ తనయుడికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఎప్పుడు ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయితే, తొలి ప్రాధాన్యంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారు.

ఏపీలోని తిరుపతితో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. లేకపోతే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Bjp-janasena, Pawan kalyan, Somu veerraju, Tdp, Tirupati Loksabha by-poll

ఉత్తమ కథలు