హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

టార్గెట్ స‌మాజ్‌వాదీ... 80 సీట్ల‌లో పోటీ అన్న ములాయం సోద‌రుడు

టార్గెట్ స‌మాజ్‌వాదీ... 80 సీట్ల‌లో పోటీ అన్న ములాయం సోద‌రుడు

యూపీలో బీజేపీని ఓడించేందుకు స‌మాజ్‌వాదీ పార్టీ ఇత‌ర పార్టీల‌తో క‌లిసి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఆ పార్టీని ములాయం సోద‌రుడు త‌ల‌నొప్పిగా మారాడు.  తన  కొత్త పార్టీ యూపీలోని  80 లోక్‌స‌భ సీట్ల‌లో పోటీ చేస్తుందని ప్ర‌క‌టించాడు.

ఇంకా చదవండి ...

    వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఎస్పీ, కాంగ్రెస్‌తో క‌లిసి బీజేపీకి షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్న స‌మాజ్‌వాదీ పార్టీకి ములాయం సింగ్ సోద‌రుడు శివ‌పాల్ యాద‌వ్ ఝ‌ల‌క్ ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం స‌మాజ్‌వాదీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి స‌మాజ్‌వాదీ సెక్యూల‌ర్ మోర్చా అనే పార్టీని ఏర్పాటు చేసిన శివ‌పాల్ యాద‌వ్... వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 80 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. శివపాల్ యాద‌వ్ కొత్త పార్టీ కార‌ణంగా స‌మాజ్‌వాదీ పార్టీకి ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని యూపీ రాజ‌కీయాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

    అఖిలేష్ యాద‌వ్‌, త‌న సోద‌రుల్లో ఒక‌రైన రాంగోపాల్ యాద‌వ్ కార‌ణంగా స‌మాజ్‌వాదీ పార్టీలో త‌న‌కు ప్రాధాన్య‌త లేకుండా పోయింద‌నే భావ‌న‌లో ఉన్న శివ‌పాల్ యాద‌వ్‌... స‌మాజ్‌వాదీ పార్టీ నుంచే ఎక్కువ‌మంది నాయ‌కుల‌ను ఆక‌ర్షించాల‌ని చూస్తున్నారు. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే చెబుతున్నారు శివ‌పాల్‌. స‌మాజ్‌వాదీ పార్టీలో నాయ‌క‌త్వం ప‌ట్ల అసంతృప్తితో ఉన్న నాయ‌కులంద‌రిని తాను కొత్త పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అఖిలేష్‌తో త‌న‌కు విభేదాలు ఉన్న‌ట్టు వస్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని శివ‌పాల్ యాద‌వ్ తెలిపారు. మ‌రోవైపు శివ‌పాల్ యాద‌వ్ కొత్త పార్టీ కార‌ణంగా స‌మాజ్‌వాదీ పార్టీకి ఎలాంటి న‌ష్టం లేద‌ని ఆ పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

    First published:

    Tags: Akhilesh Yadav, Sp-bsp, Uttar pradesh

    ఉత్తమ కథలు