హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

శతృఘ్న సిన్హాకు ఇక ఎయిర్‌పోర్టు వీఐపీ ‘గౌరవం’ కట్

శతృఘ్న సిన్హాకు ఇక ఎయిర్‌పోర్టు వీఐపీ ‘గౌరవం’ కట్

శతృఘ్న సిన్హా(ఫైల్ ఫోటో)

శతృఘ్న సిన్హా(ఫైల్ ఫోటో)

ఇన్ని రోజులు శతృఘ్న సిన్హా తనిఖీలు అవసరం లేకుండా తన వాహనంలో నేరుగా విమానాశ్రయం లోపలికి వెళ్లేవారు. అయితే ఇక ‘గౌరవం’ ఆయనకు ఉండదు. సాధారణ ప్రయాణీకుడిలా తనిఖీల తర్వాతే విమానాశ్రయం లోనికి అడుగు పెట్టాల్సి ఉంటుంది.

  పాట్నా ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి శతృఘ్న సిన్హాను ఇక వీఐపీగా పరిగణించబోరు. తనిఖీలు అవసరం లేదని ప్రముఖుల జాబితా నుంచి శతృఘ్న సిన్హా పేరును తొలగించేశారు. పాట్నా ఎయిర్‌పోర్టులో వీఐపీ జాబితా నుంచి ఆయన పేరును తొలగించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఇక ఆయన సాధారణ ప్రయాణీకుల్లానే తనిఖీల అనంతరం విమానాశ్రయం లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది.

  గతంలో ఆయన పేరు వీఐపీల జాబితాలో ఉండడంతో తనిఖీలు, సెక్యూరిటీ తనిఖీల నుంచి మినహాయింపు ఉండేది. ఆయన తన వాహనంలోనే ఎలాంటి తనిఖీలు లేకుండా విమానాశ్రయం లోపలి వరకు వచ్చేవారు. అయితే ఇకపై ఆయనకు అలాంటి వీఐపీ ‘గౌరవం’ ఏదీ ఉండదు. ఇతర ప్రయాణీకుల్లానే ఆయన కూడా తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాట్నా‌లోని జయ ప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ లహౌరియా మీడియాకు తెలిపారు. వీఐపీ జాబితాలో ఆయన పేరును కొనసాగిస్తూ తమకు ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

  గత కొంతకాలంగా శతృఘ్న సిన్హా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పాట్నా ఎయిర్‌పోర్టు వీఐపీల జాబితా నుంచి ఆయన పేరును తప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

  Published by:Janardhan V
  First published:

  Tags: Bjp, Shatrughan Sinha

  ఉత్తమ కథలు