హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా.. బీజేపీలో వన్ మ్యాన్ షో నడుస్తోందని కామెంట్

కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా.. బీజేపీలో వన్ మ్యాన్ షో నడుస్తోందని కామెంట్

గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన శత్రుఘ్న సిన్హా.. కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌లో ఆయన చేరిక లాంఛనమే అని అంతా భావించారు. అనుకున్నట్టే శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి ...

    బీజేపీ రెబల్, పాట్నా ఎంపీ శత్రుఘ్న సిన్హా శనివారం కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. బరువెక్కిన హృదయంతో పార్టీని వీడుతున్నానని, కారణాలు అందరికీ తెలిసినవేనని అన్నారు. తాను పార్టీ మారుతున్న ఏప్రిల్ 6వ తేదీ బీజేపీ సంస్థాపన దినోత్సవం అని కూడా గుర్తుచేశారు. పార్టీ నేతలెవరికీ తాను చెడు తలపెట్టలేదని, బీజేపీ దిగ్గజాలైన నానాజీ దేశ్‌ముఖ్, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి వారి మార్గదర్శనంలో ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. బీజేపీలో ప్రజాస్వామ్యం కాస్త నియంత్రుత్వంగా మారిపోయిందని.. ఇప్పుడు ఆ పార్టీలో అంతా వన్ మ్యాన్ షో నడుస్తోందని విమర్శించారు.

    కాగా, గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన శత్రుఘ్న సిన్హా.. కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌లో ఆయన చేరిక లాంఛనమే అని అంతా భావించారు. అనుకున్నట్టే శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    First published:

    Tags: Bjp, Lok Sabha Election 2019, Rahul Gandhi, Shatrughan Sinha

    ఉత్తమ కథలు