హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video Viral:లోక్‌సభలో చర్చ..సోషల్ మీడియాలో రచ్చ..కమాన్‌ గుసగుస

Video Viral:లోక్‌సభలో చర్చ..సోషల్ మీడియాలో రచ్చ..కమాన్‌ గుసగుస

DELHI:ఇద్దరు ఎంపీలు లోక్‌సభలో మాట్లాడుకున్న వీడియో వైరల్ అవుతోంది. శశిథరూర్‌, సుప్రియా సూలే గుసగుసల వీడియోపై తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఎంపీ కవర్ చేసుకున్నప్పటికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

DELHI:ఇద్దరు ఎంపీలు లోక్‌సభలో మాట్లాడుకున్న వీడియో వైరల్ అవుతోంది. శశిథరూర్‌, సుప్రియా సూలే గుసగుసల వీడియోపై తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఎంపీ కవర్ చేసుకున్నప్పటికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

DELHI:ఇద్దరు ఎంపీలు లోక్‌సభలో మాట్లాడుకున్న వీడియో వైరల్ అవుతోంది. శశిథరూర్‌, సుప్రియా సూలే గుసగుసల వీడియోపై తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఎంపీ కవర్ చేసుకున్నప్పటికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

ఇంకా చదవండి ...

వాళ్లిద్దరు ప్రజాప్రతినిధులు. పెద్దల సభలో ఉన్నారు. ఓ ముఖ్యమైన అంశంపైనే చర్చ జరుగుతోంది. తోటి సీనియర్ సభ్యుడు చర్చిస్తున్నారు. అలాంటి సమయంలో ఎంతో హుందాగా, మర్యాదగా వ్యవహరించాలి. కాని వాళ్లు సభా సంప్రదాయాన్ని మర్చిపోయారు. తరగతి గదిలో స్టూడెంట్స్‌లా, కాలేజీలో బెంచ్‌ మెట్స్‌లా పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వాళ్లు ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కని వ్యక్తులో ..లేదంటే పెద్దగా కొత్తగా చట్టసభల్లో అడుగుపెట్టిన వాళ్లో అయితే ఈ వాళ్ల చర్చ రచ్చకెక్కేది కాదు. కాని వాళ్లిద్దరూ బాగా పేరున్న వ్యక్తులు కావడంతో సోషల్ మీడియా(Social media)లో వీరి వ్యవహారం చూస్తున్న వాళ్లంతా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే కాంగ్రెస్‌ ఎంపీ(Congress MP) శశిథరూర్‌(Shashi Tharoor), బారామతి ఎంపీ (Baramati MP)సుప్రియా సూలే (Supriya Sule)లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. సభలో శశిథరూర్‌ మాట్లాడటం పూర్తవగానే లోక్‌సభ (Lok Sabha) స్పీకర్‌ చైర్‌లో కూర్చున్న ప్రేమ్‌చంద్రన్ జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, ఫరూక్‌ అబ్దుల్లాను మాట్లాడేందుకు సమయం ఇచ్చారు. ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah)రష్యా-ఉక్రెయిన్‌ వార్‌పై చర్చిస్తున్నారు. ఇంకా ఉక్రెయిన్‌లో ఎవరైనా భారతీయులు ఉండి ఉంటే వారిని క్షేమంగా ఇండియాకు తేవాల్సిన బాధ్యత, వారికి ఇక్కడ కల్పించాల్సిన అంశాలు, రష్యాకు భారత్‌ సహాయనిరాకరణ వంటి అంశాలపై చర్చ జరుగుతుండగా..ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శశిథరూర్‌ని మాట్లాడేందుకు వెనక్కి తిరిగారు. వెనుక వరుసలో కూర్చున్న శశిథరూర్‌ ఆమె పిలవగానే ఆసక్తిగా ముందుకు వంగి బల్లపై తన తల ఆనించి మరీ కబుర్లు చెప్పుకున్నారు. సాధారణంగా పెద్దల సభలో ఎంపీలు నిద్రపోవడం, లేదంటే సెల్‌ఫోన్స్‌ చూసుకోవడం వంటివి చూస్తుంటాం. కాని ఇప్పుడు ఇద్దరు ఎంపీలు మరో సభ్యుడు మాట్లాడుతుంటే ఫన్నీగా ముచ్చట్లు పెట్టుకుంటున్న వీడియో బయటకు రావడంతో నెటిజన్లు (Netizens)శశిథరూర్‌ని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

కమాన్‌ గుస గుస..

లోక్‌సభలో ఇద్దరు ఎంపీల గుసగుసలకు సంబంధించిన వీడియో ఎంత త్వరగా వైరల్ అయిందో అంతే స్పీడుగా రియాక్ట్ అయ్యారు శశిథరూర్. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషను సమర్ధించుకున్నారు. ఫరూక్‌ అబ్దుల్లా తర్వాత సుప్రియా సూలే మాట్లాడాల్సి ఉందని ఆమెకు పాలసీకి సంబందించిన కొన్ని డౌట్స్ ఉంటే తనను క్లారిఫై చేసుకుందని కవర్ చేశారు. అంతే కాదు ఫరూక్ అబ్దుల్లా స్పీచ్‌కి డిస్టబెన్స్ కలగకూడదనే ఉద్దేశంతోనే ఆమె నెమ్మదిగా మాట్లాడింది అందుకే తాను బల్లపై తల ఆనించి వినాల్సి వచ్చిందని కవర్ చేసుకున్నారు. దీనికే ఇంత రాద్ధాంతం చేయాలా అన్నట్లుగా ట్వీట్‌తో రిప్లై ఇచ్చారు కాంగ్రెస్‌ ఎంపీ.

లోక్‌సభలో రచ్చ..సోషల్ మీడియాలో రచ్చ..

ఎంపీగారి రిప్లై ఎలా ఉన్నా వీడియో మాత్రం విచ్చలవిడిగా వైరల్ అవుతోంది. శశిథరూర్‌ ఈ ట్వీట్‌తో పాటు మరో ట్వీట్‌ చేశారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ రాజేష్‌ఖన్నా,షర్మిలాఠాగూర్ నటించిన అమర్ ప్రేమ్ సినిమాలోని కుచ్‌ తో లోగ్ కహంగే, లోగోన్‌కా కామ్‌ హీ కెహ్నా అని హిందీ పాట చరణాన్ని షేర్ చేసి ఈ ట్వీట్‌కు సుప్రియా సూలేను టాగ్ చేశారు శశిథరూర్. అంటే కాంగ్రెస్‌ ఎంపీ ఉద్దేశంలో ఎవరో ఏదో ఒకటి అంటూ ఉంటారు...ఏదో ఒకటి అనడమే అలాంటి వాళ్ల పని అని సైలెంట్‌గా కౌంటర్‌ ఇచ్చారు.

First published:

Tags: Lok sabha, Shashi tharoor, Viral Video

ఉత్తమ కథలు