హోమ్ /వార్తలు /national /

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్... మానవ హక్కుల సంఘాలపై జనం సీరియస్

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్... మానవ హక్కుల సంఘాలపై జనం సీరియస్

పోలీసులకు మద్దతు తెలుపుతున్న తరుణంలో వీరు పోలీసులపై కేసులు వేయటం పలు విమర్శలకు తావిస్తోంది. #AntiSocialActivists పేరుతో అన్ని సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతుంది.

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసును ఊహించని విధంగా ముగించినటువంటి తెలంగాణ పోలీసులపై మానవ హక్కులంటూ కొందరు వ్యక్తులు కేసులు పెట్టారు. సంధ్య, దేవి అనే సామజిక వేత్తలతో పాటు విమల మోర్తాల, పద్మజ షా మరియు నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్ మూమెంట్స్ అధ్యక్షురాలు మీరా సంఘ్తమిత్ర ఇంకా కొందరు కలిసి ప్రజల మద్దతు అధికంగా ఉన్నటువంటి పోలీసులపై మానవహక్కుల ఉల్లంఘన అంటూ ఈ కేసులు వేసినట్లు సమాచారం. అయితే ఈ కేసుల పేరుతో హడావుడి చేస్తున్న వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిపై నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.

  అన్యాయం జరిగినప్పుడు బయటకు రారు... వచ్చినా సమస్యను పరిష్కరించరు. సమస్యను పెంచటానికి వస్తారు. న్యాయం జరిగినాక వచ్చి దానిలొ లొసుగులు కనిపెట్టి పబ్లిసిటీ వెతుక్కుంటారంటూ కొందరు జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అన్యాయం జరిగినప్పుడు ఎందుకు జరిగిందని ఇలాంటి వాళ్లు రారు.. కానీ న్యాయం జరిగాకా వచ్చి నాలుకలాడిస్తారని ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పేరోజు దగ్గర్లో ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఒకవేళ వచ్చినా కులాలను బట్టి మతాలను బట్టి ప్రజల మధ్య కుంపట్లు పెడతారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

  దేశం మొత్తం దిశ విషయంలో న్యాయం జరిగిందని తెలంగాణ పోలీసులను ప్రశంశిస్తుంటే వీరు మాత్రం కేసులంటూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన పర్లేదు కానీ ఆ నలుగురు క్రూరులకు మాత్రం న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే దిశ విషయంలో దేశం మొత్తం ఒక్కటై తెలంగాణ పోలీసులకు మద్దతు తెలుపుతున్న తరుణంలో వీరు పోలీసులపై కేసులు వేయటం పలు విమర్శలకు తావిస్తోంది. #AntiSocialActivists పేరుతో అన్ని సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతుంది.

  First published:

  Tags: Shadnagar, Shadnagar encounter, Shadnagar rape, Telangana, Telangana News

  ఉత్తమ కథలు