హోమ్ /వార్తలు /national /

తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు...

తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు...

సుజనా చౌదరి

సుజనా చౌదరి

ఐనప్పటికీ సీబీఐ నోటీలివ్వడంతో తెలంగాణ హైకోర్టును సుజనా ఆశ్రయించారు. ఐతే సీబీఐ విచారణకు హాజరవ్వాల్సిందేనని కోర్టు స్పష్టచేయడంతో మేలో సుజనాను విచారించనుంది సీబీఐ.

  కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ కేసులో సీబీఐ నోటీసులను సవాల్‌చేస్తూ సుజనా వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టంచేసింది. మే 27, 28 తేదీల్లో బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు జారీచేసింది. రెండ్రోజుల్లో విచారణ పూర్తిచేయాలన్న కోర్టు... ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య మాత్రమే విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది.


  బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసినట్లు బెంగళూరు బ్రాంచ్‌లో సుజనా చౌదరిపై కేసు నమోదయింది. దానికి సంబంధించి విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈనెల 25న, 29న రెండుసార్లు సీబీఐ అధికారులు సమన్లు జారీచేశారు.


  సీబీఐ సమన్లపై గతంలోనే స్పందించిన సుజనా చౌదరి.. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీతో తనకు సంబంధం లేదని స్పష్టంచేశారు. 2003 నుంచి 2014 వరకు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, స్ప్లెండింగ్ మెటల్ ప్రాడక్ట్స్, నియాన్ టవర్స్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లో ఉన్నానని తెలిపారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లేని స్పష్టంచేశారు. ఐనప్పటికీ సీబీఐ నోటీలివ్వడంతో తెలంగాణ హైకోర్టును సుజనా ఆశ్రయించారు. ఐతే సీబీఐ విచారణకు హాజరవ్వాల్సిందేనని కోర్టు స్పష్టచేయడంతో మేలో సుజనాను విచారించనుంది సీబీఐ.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Sujana Chowdary, Tdp, Telangana High Court, Telangana News

  ఉత్తమ కథలు