హోమ్ /వార్తలు /national /

పార్టీ కోసం త్యాగాలకు సిద్ధపడాలి: రేణుక

పార్టీ కోసం త్యాగాలకు సిద్ధపడాలి: రేణుక

రేణుకా చౌదరి(ఫైల్ ఫోటో)

రేణుకా చౌదరి(ఫైల్ ఫోటో)

పార్టీ ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం అంతా సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి అన్నారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

    పార్టీ గెలవాలంటే సీనియర్ నేతలు త్యాగాలకు సిద్ధపడాలని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. అవసరమైతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు. అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థులకు సహకారం అందించి పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. అయితే టిక్కెట్ల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని ఆమె సూచించారు.

    టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు రేణుక మాటలు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. సీనియర్లు, జూనియర్ల కలయికతో సమతూకంగా కమిటీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. గెలుపు గుర్రాలకు, అందులోనూ యువకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే పలువురు సీనియర్ నేతలు తమ వారసులకు, అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ఇప్పటికీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిష్టానం వైఖరినే రేణుకా చౌదరి చెప్పారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

    First published:

    Tags: CM KCR, Congress, Telangana, Telangana Election 2018, Trs

    ఉత్తమ కథలు