హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రాజస్థాన్ లో తీవ్రస్థాయికి పొలిటికల్ హీట్..పైలట్ ఎప్పటికీ సీఎం కాలేడన్న గెహ్లాట్

రాజస్థాన్ లో తీవ్రస్థాయికి పొలిటికల్ హీట్..పైలట్ ఎప్పటికీ సీఎం కాలేడన్న గెహ్లాట్

అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ, సచిన్ పైలెట్ (ఫైల్ ఫోటో)

అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ, సచిన్ పైలెట్ (ఫైల్ ఫోటో)

Ashok gehlot Vs Sachin pilot : ఎడారి రాష్ట్రం రాజస్థాన్(Rajasthan) లో మళ్లీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ..రాజస్థాన్​లోని కాంగ్రెస్​ పార్టీ(Congress party)లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ashok gehlot Vs Sachin pilot : ఎడారి రాష్ట్రం రాజస్థాన్(Rajasthan) లో మళ్లీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ..రాజస్థాన్​లోని కాంగ్రెస్​ పార్టీ(Congress party)లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. గురువారం ఓ జాతీయ ఛానల్ కు సీఎం గెహ్లాట్(CM Ashok gehlot) ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ కీలక నేత సచిన్ పైలట్(Sachin pilot) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలట్‌ నమ్మకద్రోహి(Traitor) అని వ్యాఖ్యానించారు. "గద్దర్ (ద్రోహి) ముఖ్యమంత్రి కాలేడు.. హైకమాండ్ సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయదు"అని గెహ్లాట్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తన సొంత సర్కారును పడగొట్టేందుకు ప్రతిపక్షంతో సచిన్‌ పైలట్‌ చేతులు కలిపాడని, దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎక్కడా జరుగలేదన్నారు. 102 మంది ఎమ్మెల్యేలలో ఎవరిని సీఎం చేసినా ఫర్వాలేదని, సచిన్‌ పైలట్‌లాంటి నమ్మకద్రోహిని మాత్రం ముఖ్యమంత్రిని చేస్తే ఊరుకోబోమన్నారు.  2020లో సచిన్‌ పైలట్‌..రాజకీయంగా ఎదగడానికి దోహదపడిన సొంత పార్టీ కాంగ్రెస్ కే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు ప్రయత్నించారంటూ మండిపడ్డారు. 2020లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హస్తముందని గెహ్లాట్ ఆరోపించారు.

సచిన్ పైలట్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు నెలరోజులకు పైగా ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లోని ఓ రిసార్ట్ లో ఉన్నారని,వారిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరచూ సందర్శిస్తుండేవారన్నారు. సచిన్ పైలట్ తో సహా పలువురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు చెప్పున బీజేపీ చెల్లించినట్లు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని సీఎం గెహ్లాట్ అన్నారు. సచిన్‌ పైలట్‌ వైపు మళ్లేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ఇచ్చారని, కొందరికి రూ.5 కోట్లు ముట్టజెప్పారని ఆరోపించారు.

Rahul Gandhi: మహిళా ఎమ్మెల్యేకు ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్

మరోవైపు,సీఎం గెహ్లాట్ వ్యాఖ్యలపై మండిపడ్డారు సచిన్ పైలట్. "అశోక్ గెహ్లాట్ నన్ను అసమర్థుడు, దేశద్రోహి అంటూ పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి, అనవసరమైనవి” అని పైలట్ అన్నారు. గెహ్లాట్ తన స్థాయికి తగ్గట్లుగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. తనను అసమర్థుడు,ద్రోహి అనడం దారుణమన్నారు. ఇలాంటి విమర్శలను పక్కనబెట్టి గుజరాత్ ఎన్నికల ఇంఛార్జ్ గా ఉన్న గెహ్లాట్ అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ఫోకస్ పెడితే బాగుంటదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. "రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను మనం ఎలా విజయవంతం చేయగలమో చూడాలి, ఎందుకంటే దేశానికి అదే అవసరం" అని పాదయాత్రలో చేరడానికి ఈ రోజు మధ్యప్రదేశ్‌కు వెళ్లిన సచిన్ పైలట్ అన్నారు.

First published:

Tags: Ashok gehlot, Congress, Rajasthan, Sachin Pilot

ఉత్తమ కథలు