తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన రికార్డ్‌ను సబితా ఇంద్రారెడ్డి సొంతం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి... ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీలో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి... మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆమె ప్రశ్నలకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చిన కేసీఆర్... గతంలో కొన్ని సమీకరణాల కారణంగానే మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేకపోయామని వ్యాఖ్యానించారు. ఈ సారి కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు స్థానం కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.
దీంతో టీఆర్ఎస్‌లోని మహిళా ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు చిగురించాయి. టీఆర్ఎస్ తరపున గెలిచిన మహిళా ఎమ్మెల్యేల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే దానిపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నారు. అయితే ఆ తరువాత పరిణామాలు మారిపోవడం... కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్‌లో విలీనం కావడంతో సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరిగింది. అంతా భావించినట్టుగానే సబితాకు మలివిడత విస్తరణలో మంత్రి పదవి దక్కింది. ఆమెతో పాటు టీఆర్ఎస్ తరపున కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సత్యవతి రాథోడ్‌కు అనూహ్యంగా మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Harish Rao, KTR, Sabita indra reddy, Telangana, Telangana cabinet, Trs