హోమ్ /వార్తలు /national /

ఆర్టీసీ కథ ముగిసినట్టే.. కేసీఆర్ ప్రకటన.. మరి ఉద్యోగుల భవిష్యత్ ఏంటి?

ఆర్టీసీ కథ ముగిసినట్టే.. కేసీఆర్ ప్రకటన.. మరి ఉద్యోగుల భవిష్యత్ ఏంటి?

ఆర్టీసీ సమ్మెలో సుమారు 48వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని కేసీఆర్ ప్రకటించారు.

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగిసినట్టు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన కేసీఆర్ ఆర్టీసీ సమ్మె గురించి విస్పష్టమైన ప్రకటన చేశారు. ‘ఆర్టీసీ యూనియన్ల పేరుతో చేస్తున్న మహాపాపం. కార్మికుల గొంతు కోస్తున్నారు. ఆర్టీసీని వాళ్లే స్వయంగా ముంచుకుంటున్నారు. నా దృష్టిలో అది అయిపోయిన కథ.’ అని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెంచామని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ మీద రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. యూనియన్ల వల్లే సమస్యలు వస్తున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

  కేసీఆర్ ప్రకటనతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. సమ్మె చేస్తున్నవారు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని కేసీఆర్ గతంలో ప్రకటించారు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి యూనియన్లతో ఎలాంటి చర్చలు జరపలేదు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా కేవలం రికార్డుల పరంగా పరిశీలనలు చేశారే కానీ, చర్చలు జరపలేదు.

  ఆర్టీసీ సమ్మెలో సుమారు 48వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు వారి భవిష్యత్ ఏంటి? సమ్మెను విరమిస్తారా? డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  First published:

  Tags: CM KCR, Rtc jac, Telangana, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు