హోమ్ /వార్తలు /national /

ఆర్టీసీ సమ్మె... రంగంలోకి కేంద్రం... కేసీఆర్‌కి షాకేనా?

ఆర్టీసీ సమ్మె... రంగంలోకి కేంద్రం... కేసీఆర్‌కి షాకేనా?

ఆర్టీసీ సమ్మె... రంగంలోకి కేంద్రం... కేసీఆర్‌కి షాకేనా?

ఆర్టీసీ సమ్మె... రంగంలోకి కేంద్రం... కేసీఆర్‌కి షాకేనా?

RTC Strike 29th Day : ఆర్టీసీ సమ్మెపై ఇప్పటివరకూ అంతంతమాత్రంగా స్పందించిన బీజేపీ... శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌తో దూకుడు పెంచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుందా?

  RTC Strike 29th Day : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 29వ రోజుకు చేరిన సమయంలో... రెండు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి... ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతోంది. రెండోది... ఆర్టీసీ సమ్మెపై కేంద్రం చొరవ చూపాలంటూ... రాష్ట్ర బీజేపీ వర్గం... కేంద్ర నాయకుల్ని కలవబోతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నాయకులు... సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకునేలా చెయ్యాలని కోరారు. అంతే... ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇవాళ ఢిల్లీ వెళ్లి... బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసి... రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, తాజా పరిణామాలను వివరించబోతున్నారు. ముఖ్యంగా... కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద సివిల్ డ్రెస్సులో ఉన్న ఓ పోలీసు అధికారి చేయిచేసుకున్న అంశాన్ని కేంద్ర పెద్దల ముందు పంచాయతీ పెట్టబోతున్నారు.

  కేసీఆర్‌కి షాకిస్తారా? : అసలే తెలంగాణలో ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... పాతుకుపోదామని ప్రయత్నిస్తున్న బీజేపీకి... ఆర్టీసీ సమ్మె, శుక్రవారం నాటి పరిణామాలు రాజకీయంగా కలిసొచ్చేలా ఉన్నాయి. మొన్నటి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో... ఢిల్లీ హైకమాండ్... రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై సీరియస్‌గా ఉన్న సమయంలో... సమ్మె ద్వారా తిరిగి ప్రజా మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికి కేంద్రం కూడా సపోర్టుగా నిలిస్తే... ఈ అంశాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని చూస్తే... అది కేసీఆర్ సర్కారుకు ఇబ్బంది కలిగించే అంశమే. కేంద్ర పెద్దలు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నదాన్ని బట్టీ... రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు ఆధారపడి ఉంటాయి. ఐతే, టీఆర్ఎస్ వర్గాలు మాత్రం... బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవనీ, హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలతో అది మరోసారి రుజువైందని అంటున్నాయి.

  కేబినెట్ నిర్ణయమేంటి? : ఓవైపు ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో... తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ భవితవ్యాన్ని తేల్చేందుకు సీఎం ఇప్పటికే చాలా మంది నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కేంద్రం అమలు చేస్తున్న రవాణా చట్టంపై కూడా సమగ్ర అధ్యయనం చేశారు. వీటన్నింటిని క్రోడీకరించి ఆర్టీసీపై సీఎం నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  30 అంశాలతో ఏజెండా తయారైనా, ఇందులో ఆర్టీసీ పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. కొన్ని రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆర్టీసీ అఫిడవిట్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంపై కేబినెట్‌లో చర్చించొచ్చు. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వీటి సంఖ్యను 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 20 శాతం రూట్లను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించనుంది. ఈ నిర్ణయాల్ని కేబినెట్‌లో ఆమోదిస్తారని తెలిసింది.


  ఫిట్‌నెస్‌ మంత్రతో మైండ్ బ్లాంక్ చేస్తున్న సప్న వ్యాస్


  ఇవి కూడా చదవండి :

  జబర్దస్త్ నాగబాబు ఫైర్... జగన్‌‌కు ఫైనల్ పంచ్

  Bigg Boss 3... శ్రీముఖి ఫోన్ నంబర్ తెలుసా...?

  Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


  ఒక్క నంబర్ తేడాతో సెక్స్ హాట్‌లైన్‌కి వెళ్లిన కాల్స్...

  కుక్క కోసం యువతి సూసైడ్... షాకైన కుటుంబ సభ్యులు

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Amit Shah, Kcr, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu, TSRTC Strike