హోమ్ /వార్తలు /national /

TSRTC : ఆర్టీసీ అధికారులకు అశ్వత్థామరెడ్డి కౌంటర్..

TSRTC : ఆర్టీసీ అధికారులకు అశ్వత్థామరెడ్డి కౌంటర్..

అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)

అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)

TSRTC Strike : చర్చల సందర్భంగా మధ్యలో బయటకొచ్చింది తాము కాదని.. అధికారులే వెళ్లిపోయారని ఆరోపించారు. వీడియో ఫుటేజీని పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు.

  ఆర్టీసీ అధికారులతో కార్మిక సంఘ నేతలు జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. చర్చల నుంచి అర్ధాంతరంగా బయటకొచ్చేసిన జేఏసీ నేతలు.. అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.అయితే తాము చర్చల మధ్యలోనే బయటకొచ్చేశామనడం సరికాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

  తాజాగా వ్యాఖ్యానించారు. ఆర్టీసీ అధికారులు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా తాము చర్చలకు సిద్దమని తెలిపారు. సోమవారం కోర్టు ప్రారంభమయ్యే లోపు.. ఏ సమయంలో అధికారుల నుంచి పిలుపు వచ్చినా చర్చలకు హాజరవుతామని స్పష్టం చేశారు.

  చర్చల సందర్భంగా మధ్యలో బయటకొచ్చింది తాము కాదని.. అధికారులే వెళ్లిపోయారని ఆరోపించారు. వీడియో ఫుటేజీని పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. బాధ్యతగల ఐఏఎస్ అధికారులు అబద్దాలు చెప్పడం సబబు కాదన్నారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని.. ఈ నెల 28న అన్ని కలెక్టరేట్ల వద్ద విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని తెలిపారు.సరూర్‌నగర్‌లో ఈ నెల 30వ తేదీన తలపెట్టిన సకలజనుల సమరభేరికి అన్ని ఆర్టీసీ కుటుంబాలు,రాజకీయ పార్టీల నేతలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.కాగా,ఆర్టీసీ అధికారులతో చర్చలు విఫలమైన అనంతరం.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ తమ జెండా రంగును మార్చింది.గులాబీ రంగు నుంచి తెల్ల రంగులోకి జెండాను మార్చింది. నేడు టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ కార్యాలయంలో అశ్వత్థామరెడ్డి జెండాను ఆవిష్కరించారు.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Ashwathama Reddy, CM KCR, Rtc, TSRTC Strike

  ఉత్తమ కథలు