హోమ్ /వార్తలు /national /

జగన్ పాలనను చిరంజీవి సినిమా టైటిల్‌తో పోల్చిన రోజా..

జగన్ పాలనను చిరంజీవి సినిమా టైటిల్‌తో పోల్చిన రోజా..

 వైఎస్ జగన్ పాలనను మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌తో పోల్చారు.

వైఎస్ జగన్ పాలనను మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌తో పోల్చారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనను మెగాస్టార్ సినిమా టైటిల్‌తో పోల్చారు ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా సెల్వమణి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన మీద ఆ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పాలనను మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌తో పోల్చారు. ‘జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన చూసి ప్రజలు సై సైరా నరసింహారెడ్డి అంటున్నారు. కానీ, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ చిన్నమెదడు చితికిపోయింది. అందుకే ఇసుక, ఇంగ్లీష్ మీడియం విషయంలో వివాదాలు సృష్టించారు. మత మార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బాధ తెలుగు కోసం కాదు.. ప్రజల కోసం కాదు. తన బినామీల స్కూళ్లు మూతపడతాయని భయం.’ అని రోజా కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ సీఎంగా మరో 20, 30 సంవత్సరాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని రోజా అన్నారు.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Megastar Chiranjeevi, MLA Roja, Roja Selvamani, Sye raa narasimhareddy

ఉత్తమ కథలు