హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిర్భయ కేసులో సుప్రీం సంచలన తీర్పు.. నలుగురు దోషులకు ఉరే..

నిర్భయ కేసులో సుప్రీం సంచలన తీర్పు.. నలుగురు దోషులకు ఉరే..

డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది.

    నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష అమలు విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షను పున:సమీక్సించాలన్న నిందితుడి రివ్యూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇదివరకే ముగ్గురు నిందితులకు క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే దోషి తరపు న్యాయవాది మాట్లాడుతూ.. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు మూడువారాల గడువు ఇవ్వాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. మూడువారాలు ఎందుకు.. వారం సరిపోతుందని పేర్కొంది. అక్షయ్‌కు ఉరిశిక్ష వేయడం సరికాదని అతని తరపు న్యాయవాది వాదనల్ని కోర్టు తప్పు పట్టింది. గతంలో కూడా ఇవే వాదనలు చేశారని న్యాయస్థానం పేర్కొంది. నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని, వాళ్లు క్షమించరాని నేరం చేశారని స్పష్టం చేసింది. మరోవైపు నిర్భయ కేసు వాదనలు వినేందుకు నిర్భయ తల్లిదండ్రులు కోర్టుకు హాజరయ్యారు.

    డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డాడు.  ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా... వారిలో ఒకడు... తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో... జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ తీహార్ జైల్లో ఉన్నారు. వాళ్లు క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో... శిక్ష అమలు కాలేదు. తాజాగా... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో... ఇప్పుడు కేంద్రానికి శిక్ష అమలు చేసేందుకు అవకాశం వచ్చింది.

    First published:

    Tags: Gang rape, Nirbhaya, Supreme Court

    ఉత్తమ కథలు