హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రాహుల్ గాంధీ మనసు మారిందా ? ఈ దూకుడు వెనుక ఉన్న కారణం ఇదేనా ? ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

రాహుల్ గాంధీ మనసు మారిందా ? ఈ దూకుడు వెనుక ఉన్న కారణం ఇదేనా ? ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు సోనియాగాంధీ నాయకత్వంపై ఉన్నంత నమ్మకం రాహుల్ గాంధీపై లేదు. ఈ విషయాన్ని వారిలో కొందరు బాహాటంగానే బయటపెట్టారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ సాధించిన ఫలితాలను బట్టి చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. ఆ పార్టీలోని సీనియర్ నేతలు అధినాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక అసలు కారణం కూడా ఇదే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్(Congress) వ్యవహారాలపై దృష్టి పెట్టిన రాహుల్ గాంధీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి 40 మంది నాయకులను పిలిపించుకుని వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాహుల్ ఈ స్థాయిలో పార్టీ వ్యవహారాలపై ఫోకస్ చేయడం నేతలకు కూడా ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి గతంలో కాంగ్రెస్ నాయకత్వం ఈ రకమైన వ్యవహారాలు చూసే విధానం భిన్నంగా ఉండేది. రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులు.. జాతీయ స్థాయిలో ఓ కీలకమైన నాయకుడితో సమావేశం కావడం.. ఆ తరువాత ఆ నాయకుడు హైకమాండ్ దగ్గరకు వెళ్లి ఈ పరిణామాలన్నీ వివరించడం జరిగేది.

కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా నేరుగా హైకమాండ్ చీఫ్ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వయంగా రంగంలోకి దిగారు. నేతలతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడారు. అయితే రాహుల్ గాంధీ ఉన్నట్టుండి తెలంగాణ (Telangana) వ్యవహారాలపై ఈ స్థాయిలో ఫోకస్ పెట్టడం వెనుక అసలు కారణంగా ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న తెలంగాణలో అయినా సత్తా చాటాలని.. లేకపోతే ఇది కూడా బీజేపీ ఖాతాలో పడిపోతుందనే టెన్షన్ కాంగ్రెస్ హైకమాండ్ వర్గాల్లో ఉంది.

అందుకే కాస్త ఆలస్యమైనా.. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని గ్రహించి స్వయంగా రంగంలోకి దిగారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఈ రేంజ్‌లో పార్టీ వ్యవహారాలపై ఫోకస్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. మరోసారి కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారని.. అందులో భాగంగానే ముందుగా అనేక రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలను మొదలుపెట్టారని పలువురు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు సోనియాగాంధీ నాయకత్వంపై ఉన్నంత నమ్మకం రాహుల్ గాంధీపై లేదు. ఈ విషయాన్ని వారిలో కొందరు బాహాటంగానే బయటపెట్టారు. అయినా గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాలన్నది వారిలో చాలామంది అభిప్రాయం. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మరోసారి కాంగ్రెస్ నాయకత్వ మార్పు అంశం తెరపైకి రావొచ్చనే విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించారని.. అందుకే ముందుగానే రంగంలోకి దిగి పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారని పలువురు చర్చించుకుంటున్నారు.

Telangana Politics: ఇదేం పద్ధతి.. రాహుల్ గాంధీ ముందే రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి అసంతృప్తి.. ముందే భేటీ నుంచి బయటకు..

KCR| Khammam: ఖమ్మం జిల్లాపై కేసీఆర్ లెక్కేంటి ? ఆ ఇద్దరినీ లైట్ తీసుకున్నారా ? మరో ఇద్దరిని నమ్ముకుంటున్నారా ?

ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధ్య పదవికి ఎన్నికలు జరిగినా.. చాలామంది నేతలు తనవైపే ఉండటానికి ఆసక్తి చూపించే అవకాశం ఉందని రాహుల్ గాంధీ అంచనా కావొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని చక్కబెట్టడం ద్వారా పార్టీ బలోపేతం కావడంతో పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యం విషయంలో తమకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని రాహుల్ గాంధీ ఆలోచన కావొచ్చని తెలుస్తోంది.

First published:

Tags: Congress, Rahul Gandhi

ఉత్తమ కథలు