సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం సాధారణం. అయితే కొందరు మాత్రం సొంత పార్టీ నేతలపైనే.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై నటి రమ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ దుమారం రేపుతున్నాయి. రమ్య చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే శివకుమార్‌పై ఆరోపణలు చేసిన రమ్యా... కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో తనకు తెలియదన్నారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ నలపాడ్. ఆమెకు తమ పార్టీలో ఏ బాధ్యతలను అప్పగించలేదన్నారు. ఏ సమస్యలున్నా మాట్లాడాలి తప్ప ఆరోపణలు చేయటం తగదన్నారు. నలపాడ్ మాటలపై రమ్య స్పందించారు. బెయిల్ పై ఉన్న వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ రమ్య ట్వీట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కన్నడ నటి, రాజకీయ నాయకురాలు రమ్య గురువారం కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్ ,పార్టీ ప్రచార కమిటీ చీఫ్ ఎంబి పాటిల్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంలో చేరారు. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ను కప్పిపుచ్చడానికి కర్ణాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్‌తో "రహస్య సమావేశం" నిర్వహించారని పాటిల్ పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఆరోపణలు చేయడంతో వీరిద్ద మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వాటిపై స్పందించిన రమ్య .. శివకుమార్ పై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "పార్టీలకు అతీతంగా ప్రజలు ఒకరినొకరు కలుస్తారు, ఫంక్షన్‌లకు వెళతారు, కొందరు కుటుంబాల్లో పెళ్లి చేసుకుంటారు - నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది @DK శివకుమార్ గట్టి కాంగ్రెస్‌వాది అయిన @MBPatil గురించి ఇలా అనడం. ఇలా అయితే ఎన్నికల్లో పార్టీ కలిసి పోరాటం చేయగలదా ? అంటూ రమ్య ట్వీట్ చేశారు.
So the ‘office’ has circulated these messages among the congress leaders & volunteers asking them troll me. Save yourself the trouble- I’ll do it myself. @srivatsayb @DKShivakumar
— Divya Spandana/Ramya (@divyaspandana) May 11, 2022
అయితే ఈ ట్వీట్ పై కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రమ్యను తప్పు పట్టారు. ఈ ట్వీట్‌ను అనుసరించి, పార్టీలో రాజకీయంగా ఎదగడానికి సహకరించిన వ్యక్తిని రమ్య మర్చిపోయారని "కాంగ్రెస్ ట్రోల్స్" దాడి చేయడం ప్రారంభించారు. పార్టీని రూ.8 కోట్లు మోసం చేశారని ఆమెపై అభియోగాలు మోపారు. దీంతో ఆమె తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. “నాకు అవకాశాలు ఇచ్చి, నాకు అండగా నిలిచిన వారెవరైనా ఉన్నారంటే అది @రాహుల్‌గాంధీ అని మరెవరైనా నాకు అవకాశాలు ఇచ్చారని చెప్పుకునే వారు అవకాశవాది. ఈ అవకాశవాదులు నన్ను వెన్నుపోటు పొడిచి అణచివేయడానికి ప్రయత్నించారు. మీరు టీవీలో చూసేవన్నీ తమను దాచుకునే ప్రహసనమే. మోసపూరిత మనస్సు." అంటూ మరో ట్వీట్ చేశారు రమ్య.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.