POLITICS RAJYA SABHA ELECTION RESULTS UPDATES BIG JOLT TO SHIV SENA IN MAHARASHTRA AND CONGRESS IN HARYANA HERE IS COMPLETE RESULTS SK
Rajya Sabha Election Results 2022: రాజ్యసభ ఎన్నికల తుది ఫలితాలు.. ఆ రెండు పార్టీలకు బిగ్ షాక్
ప్రతీకాత్మక చిత్రం
Rajya Sabha election Results 2022: మహారాష్ట్రలో మాత్రం అధికార కూటమికి దెబ్బ పడింది. శివసేన నేత సంజయ్ పవార్ ఓడిపోయారు. హర్యానాలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి చేతితో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అజయ్ మాకెన్ పరాజయం పాలయ్యారు.
శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections 2022) తుది ఫలితాలు వెలువడ్డాయి. ఐతే అధికారంలో పార్టీలకే అత్యధిక స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో మాత్రం అధికార కూటమికి దెబ్బ పడింది. శివసేన నేత సంజయ్ పవార్ ఓడిపోయారు. హర్యానాలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి చేతితో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అజయ్ మాకెన్ పరాజయం పాలయ్యారు. వాస్తవానికి 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. అందులో 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 సీట్లను శుక్రవారం ఎన్నికలు జరిగాయి. అనంతరం కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటించారు. కర్నాటక, రాజస్థాన్‌లో నిన్నే ఫలితాలు వెలువడగా.. మహారాష్ట్ర, హర్యానాలో మాత్రం కాస్త ఆలస్యమయ్యాయి.
మహారాష్ట్ర (Maharashtra)లో మహా వికాస్ అఘాడి (Maha Vikas Aghadi) కి షాక్ తగిలింది. 6 సీట్లలో 3 సీట్లు బీజేపీ గెలిచింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించింది. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పీయుష్ గోయెల్, అనిల్ బాండే, ధనంజయ్ మహదిక్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక శివసేన తరపున సంజయ్ రౌత్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి గెలుపొందారు. ఆరో సీటు కోసం బీజేపీ, శివసేన మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. చివరకు బీజేపీ పైచేయి సాధించింది. శివసేన నేత సంజయ్ పవార్ ఓడిపోయారు.
హర్యానాలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే పడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ఓడిపోయారు. హర్యానాలో రెండు సీట్లలో ఒక సీట్లో బీజేపీ, మరో చోట స్వతంత్ర అభ్యర్థి కార్తీక్ శర్మ గెలిచారు. బీజేపీ నుంచి క్రిషన్‌లాల్ పన్వార్ విజయం సాధించారు. ఇండిపెండెంట్ చేతిలో అజయ్ మాకెన్ ఓడిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.
రాజస్థాన్ (Rajasthan Rajya sabha Results)లో అధికార కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను గెలుపొందింది. విపక్ష బీజేపీకి కేవలం 1 సీటు మాత్రమే దక్కింది. క్రాస్ ఓటింగ్‌పై నమ్మకం పెట్టుకున్న జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు నిరాశే ఎదురైంది. ఆయన ఓడిపోయారు. రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థులు ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సుర్జేవాలాలకు అధిక ఓట్లు లభించాయి. ఫలితంగా బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ తివారీతోపాటు బీజేపీ బలపరిచిన జీ మీడియా చైర్మన్ సుభాష్ చంద్ర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ బరిలో నిలిపిన అభ్యర్థులందరూ గెలిచినట్టయింది. ఇక బీజేపీ నుంచి ఘనశ్యామ్ తివారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కర్నాటక(Karnataka Rajya sabha Results)లో 4 సీట్లకు ఎన్నికలు జరిగితే మూడింట బీజేపీ గెలవగా.. కాంగ్రెస్ ఒక సీటును దక్కించుకుంది. బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, లహర్ సింగ్ సిరోయా, జగ్గేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థి మన్సూర్ అలీఖాన్ ఓటమి పాలయ్యారు. జేడీఎస్ ఒక సీటుకు పోటీ చేసినప్పటికీ... విజయం దక్కలేదు. ఆ పార్టీ అభ్యర్థి డి. కుపేంద్ర రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారంతా.. వచ్చే నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.