Home /News /national /

POLITICS RAJYA SABHA ELECTION RESULTS 2022 BJP WINS 3 SEATS IN KARNATAKAAKA CONGRESS BAGS 3 IN RAJASTHAN RESULTS DELAYED IN MAHARASHTRA HARYANA SK

Rajya Sabha Election Results 2022: ఆసక్తికరంగా రాజ్యసభ ఫలితాలు.. ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajya Sabha Election Results 2022: మహారాష్ట్రలో 6 సీట్లు, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.

    రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha Elections 2022) భాగంగా 4 రాష్ట్రాల్లో 16 సీట్లకు నిన్న (శుక్రవారం) జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. అందులో 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 సీట్లను శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఐతే అధికారంలో పార్టీలకే అధిక స్థానాలు దక్కాయి. రాజస్థాన్‌‌ (Rajasthan Rajya sabha Results)లో అధికార కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను గెలుపొందింది. విపక్ష బీజేపీకి కేవలం 1 సీటు మాత్రమే దక్కింది. క్రాస్ ఓటింగ్‌పై నమ్మకం పెట్టుకున్న జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర‌కు నిరాశే ఎదురైంది. ఆయన ఓడిపోయారు. రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థులు ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సుర్జేవాలా‌లకు అధిక ఓట్లు లభించాయి. ఫలితంగా బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ తివారీ‌తోపాటు బీజేపీ బలపరిచిన జీ మీడియా చైర్మన్ సుభాష్ చంద్ర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ బరిలో నిలిపిన అభ్యర్థులందరూ గెలిచినట్టయింది. ఇక బీజేపీ నుంచి ఘనశ్యామ్ తివారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

    కర్నాటక(Karnataka Rajya sabha Results)లో 4 సీట్లకు ఎన్నికలు జరిగితే మూడింట బీజేపీ గెలవగా.. కాంగ్రెస్ ఒక సీటును దక్కించుకుంది. బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, లహర్ సింగ్ సిరోయా, జగ్గేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థి మన్సూర్ అలీఖాన్ ఓటమి పాలయ్యారు. జేడీఎస్ ఒక సీటుకు పోటీ చేసినప్పటికీ... విజయం దక్కలేదు. ఆ పార్టీ అభ్యర్థి డి. కుపేంద్ర రెడ్డి ఓడిపోయారు.



    ఇక మహారాష్ట్ర(Maharashtra Rajya sabha Results)లో 6 సీట్లు, హర్యానా (Haryana Rajya sabha Results)లో 2 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. నిన్న ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా సేపటికి కూడా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ఇవాళ ఉదయం ఈ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 6 సీట్లకు ఏడుగరు పోటీచేయగా... హర్యానాలో రెండు సీట్లు ముగ్గురు పోటీ పడ్డారు.

    President Elections: రాష్ట్రపతి రేసులో ఉన్నది వీళ్లేనా? అది వర్కవుట్ అయితే వెంకయ్యనాయుడే ప్రెసిడెంట్..!

    తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఐతే రెండు చోట్లా అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉండడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి దివకొండ దామోదర్ రావు, బండి పార్థసారధి రెడ్డి గెలిచారు. ఏపీలో వైసీపీ నుంచి బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, విజయసాయిరెడ్డి గెలుపొందారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

    ఇక తమిళనాడులో మూడు డీఎంకే, రెండు అన్నాడీఎంకే, ఒక సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. యూపీలో 11 స్థానాలకు.. 8 బీజేపీకి దక్కాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎల్డీ ఒక్కో స్థానంలో గెలిచాయి. బీహార్‌లో 5 సీట్లకు రెండు ఆర్జేడీ, రెండు బీజేపీ, ఒక సీటును జేడీయూను దక్కించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండుకు రెండు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లో జేఎంఎం, బీజేపీ ఒక్కోచోట విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మూడు సీట్లకు రెండు బీజేపీ, ఒక సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒడిశాలో మూడుకు మూడు సీట్లు అధికార బీజేడీకే ఏకగ్రీవమయ్యాయి. పంజాబ్‌లో రెండు సీట్లలో ఆమాద్మీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    Presidential Elections 2022: దేశ తదుపరి రాష్ట్రపతి ఎవరు ? మోదీ మనసులో ఉన్నదెవరు ? మెజార్టీకి బీజేపీ ఎంత దూరమంటే..

    కాగా, తాజా ఎన్నికలతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తున్నందన.. రాజ్యసభ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. రాజ్యసభలో ఈ మధ్యే 100 మార్కును దాటిన బీజేపీకి కూడా కొన్ని స్థానాలు తగ్గి.. వందలోపే పరిమితమవుతుంది. యూపీలో ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఎస్పీ.. పెద్దల సభలో ఒకే ఒక్క సీటుకు పరిమితం కానుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Congress, Rajya Sabha Elections 2022, Rajyasabha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు