Rajinikanth Party : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారా? 2021 ఎన్నికలకు రెడీ అయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? అంటే మీడియా వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. గురువారం నాడు రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు కూడా రజనీకాంత్ పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రజినీ మక్కల్ మండ్రమ్ (ఆర్ఎంఎం) జిల్లా కార్యదర్శుల సమావేశం ముగిసిన నేపథ్యంలో ఆఫీస్ బేరర్ల సమావేశం గురువారం జరగబోతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. అదీకాక.. రజనీకాంత్ ఆఫీస్ నుంచి తమకు ఫోన్లు వచ్చాయని ఆర్ఎంఎం ప్రతినిధులు వెల్లడించారు. గురువారం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రజనీకాంత్‌కు చెందిన కల్యాణ మంటపానికి రావాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీని ఎప్పుడు ప్రారంభించబోయేది చెప్పే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajnikanth, Tamilnadu