రాజస్థాన్ రాజకీయం రంజుగా మారుతోంది. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ దగ్గర పార్టీ ఎమ్మెల్యేలెవరూ పెద్దగా లేరని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు కావాల్సినంత మెజార్టీ ఉందని నిన్న జైపూర్‌లో కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారు. నిన్న సీఎల్పీ సమావేశం నిర్వహించి... అశోక్ గెహ్లాట్ బలపరీక్ష చేసుకున్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఉన్నట్టుండి ఓ వీడియోను విడుదల చేసిన సచిన్ పైలెట్... కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను ఆయన కార్యాలయం విడుదల చేసింది.
10 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఇంద్రా గుర్జార్, ముఖేష్ భాకర్, హరీష్ మీనా, పీఆర్ మీనాను గుర్తించొచ్చు. అయితే, సచిన్ వీడియోలో కనిపించలేదు. టూరిజం మినిస్టర్ విశ్వేంద్ర సింగ్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టారు.దీంతో కాంగ్రెస్ ఒక్కసారిగా ఖంగుతింది. మరోవైపు నేడు రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్షం మరోసారి భేటీ కానుంది.
Haryana: Rajasthan Congress MLAs Inder Raj Gurjar, PR Meena, GR Khatana, and Harish Meena among others, at a hotel in Manesar. (Video released from Sachin Pilot's office of MLAs supporting him) pic.twitter.com/IHToT5tkiR
— ANI (@ANI) July 13, 2020
ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్‌లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్‌నేత సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామని తెలిపారు. ఇక సచిన్ పైలెట్‌ను బుజ్జగించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలెట్ మంగళవారం మెత్తబడతారా ? లేక కాంగ్రెస్‌పై తన తిరుగుబాటును కొనసాగిస్తారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, Congress, Rajasthan, Sachin Pilot